న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలక్షన్ విషయంలో రోహిత్‌శర్మను ఏకిపారేసిన ఇయాన్ బిషప్, వెటోరి

Daniel Vettori And Ian Bishop Trolls Rohit Sharma For giving Chances Tim David

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్నందుకుంది. శుక్రవారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై.. 5 పరుగుల తేడాతో ఖతర్నాక్ గెలుపొందింది. చివరి ఓవర్‌లో 9పరుగులను డిఫెండ్ చేసిన డానియల్ సామ్స్.. ముంబైకి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను గుజరాత్ అనవసర తప్పిదాలతో చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత 177పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20ఓవర్లలో 5 వికెట్లకు 173పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి మూటగట్టుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ముంబై మళ్లీ తన జోరు అందుకుందని నెటిజన్లు పేర్కొంటున్నా.. కొందరు క్రికెట్ ప్రముఖులు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీని ఏకిపారేస్తున్నారు.

సరైన సిచువేషన్లో గుజరాత్ బౌలర్లపై దాడి

సరైన సిచువేషన్లో గుజరాత్ బౌలర్లపై దాడి

ఈ మ్యాచ్‌లో కీలక టైంలో రాణించిన టిమ్ డేవిడ్ (21బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్)తో ముంబై ఇన్నింగ్స్ చివర్లో మంచి స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు. ఓ వైపు పొలార్డ్ 14బంతులు ఎదుర్కొని కేవలం 4పరుగులు మాత్రమే చేసి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వేళ.. ముంబై 150పరుగులు అయినా చేస్తుందో లేదో అనే సిచువేషన్లో టిమ్ డేవిడ్ గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. లోయర్ ఆర్డర్లో ఓ సమర్థుడైన ప్లేయర్ ఒకడున్నాడని తన ఇన్నింగ్స్ ద్వారా చాటిచెప్పాడు. చివర్లో డేవిడ్ చేసిన పరుగులే ముంబై మ్యాచ్ విన్నింగ్‌కు కీలకమయ్యాయి. అయితే డేవిడ్‌కు ముంబై ఈ సీజన్ ఫస్టాఫ్‌లో సరైన అవకాశాలు ఇవ్వకపోవడంపై రోహిత్ శర్మ కెప్టెన్సీని క్రికెట్ లెజెండ్స్ డానియల్ వెటోరీ, ఇయాన్ బిషప్ తూర్పారబట్టారు.

కీలక టైంలో రాణించే ప్లేయర్

కీలక టైంలో రాణించే ప్లేయర్

సింగపూర్‌ దేశానికి చెందిన టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతుంటాడు. ఇతనికి డెత్-ఓవర్ స్ట్రైక్ హిట్టర్‌గా పేరుంది. బిగ్ బాష్ లీగ్‌‌లో చెలరేగి ఆడిన టిమ్ డేవిడ్‌ను ఈ సీజన్‌లో ముంబై 8.25కోట్లకు కొనుగోలు చేసింది. అతనో మంచి ఫినిషర్. అయినప్పటికీ డేవిడ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సరైన అవకాశాలు ఇవ్వలేదు. డేవిడ్‌కు రెండు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో కాస్త రాణించకపోవడంతో అతన్ని ఇక 8మ్యాచ్‌ల వరకు తీసుకోలేదు. 9వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పై జరగగా ఆ మ్యాచ్‌లో చివర్లో టిమ్ డేవిడ్ కీలక 20పరుగులు చేసి ముంబైని గెలిపించాడు. అలాగే 10వ మ్యాచ్ అయిన నిన్నటి జీటీతో జరిగిన మ్యాచ్‌లోనూ 44పరుగులు చేసి రాణించాడు.

ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు తెలిసే ఉంటుంది

ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు తెలిసే ఉంటుంది

ఇయాన్ బిషప్ మాట్లాడుతూ.. 'ఈ ఐపీఎల్లో టిమ్ డేవిడ్ ఆడుతున్నాడని తెలిసి చాలా మంది నన్ను అడిగారు.. ఇంతకు డేవిడ్ ఏం టీం తరఫున ఆడుతున్నాడు. ఏ బ్యాటింగ్ ఆర్డర్లో ఆడుతున్నాడని ప్రశ్నలు వేశారు. అతన్ని తుది జట్టులోకి ఎందుకు తీసుకోవాలో ఈ రెండు గేమ్‌లలో చూపించాడు. ముంబై ఇండియన్స్‌కు ఇప్పుడు తెలిసే ఉంటుంది టోర్నమెంట్ ప్రథమార్ధంలో తమ తుది జట్టు సెలక్షన్లో మిస్టేక్ అయి ఉంటుందని బిషప్ పేర్కొన్నాడు. డేవిడ్ యంగ్ ప్లేయర్.. అతనికి కాస్త అవకాశాలిస్తే డైనమిక్‌గా మారతాడని బిషప్ తెలిపాడు.

ముంబై టీంలో సెలెక్షన్ లోపం ఉంది

ముంబై టీంలో సెలెక్షన్ లోపం ఉంది

ఇక వెటోరీ మాట్లాడుతూ.. 'డేవిడ్‌ది చాలా అద్భుతమైన ఇన్నింగ్స్' షమీ, లాకీ ఫెర్గూసన్ లాంటి మేటి బౌలర్లను అతను సమర్థంగా ఎదుర్కొని హిట్టింగ్ చేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు 21బంతుల్లో 44పరుగులు చేయడం నిజంగా మెచ్చుకోదగ్గది. అతన్ని ఐపీఎల్ ఫస్టాఫ్‌లో ఎందుకు తీసుకోలేదో అర్థం చేసుకోలేకపోతున్నా. ముంబై టీంలో సెలెక్షన్ లోపం ఉందని' వెటోరి తెలిపాడు.

Story first published: Saturday, May 7, 2022, 14:37 [IST]
Other articles published on May 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X