న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేల్ స్టెయిన్‌కు ఊహించని షాకిచ్చిన దక్షిణాఫ్రికా బోర్డు!!

Dale Steyn Snubbed From Cricket South Africas New Contract List
Dale Steyn Left Out Of Cricket South Africa's Contract List

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌కు ఊహించని షాక్ తగిలింది. 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్టెయిన్‌కు క్రికెట్ దక్షిణాఫ్రికా చోటివ్వలేదు. మొత్తం 16 మంది క్రికెటర్లతో కూడిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాను సోమవారం క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించగా.. అందులో స్టెయిన్‌కు చోటు దక్కలేదు. అయితే బ్యూరాన్ హెండ్రిక్స్ మాత్రం తొలిసారి జాతీయ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్‌డెర్ డుసెన్, అన్రిచ్ నోర్జేలు తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాను మెరుగుపరుచుకున్నారు.

<strong>కరోనా సెలవులు.. వార్నర్ ఏం చేస్తున్నాడంటే? (వీడియో)</strong>కరోనా సెలవులు.. వార్నర్ ఏం చేస్తున్నాడంటే? (వీడియో)

సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో దక్కని చోటు:

సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో దక్కని చోటు:

16 మంది పురుషుల ఆటగాళ్లతో పాటు 14 మంది మహిళలకు క్రికెట్ దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు కల్పించింది. బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ పాల్ మాట్లాడుతూ... 'బోర్డు 16 మందికి కాంట్రాక్ట్ ఇచ్చింది. దక్షిణాఫ్రికా జాతీయ జట్టును మూడు ఫార్మాట్లలోనూ ఈ 16 మంది ఆటగాళ్లతోనే నడిపించొచ్చని నమ్ముతున్నాం. ఇందులోనే టెస్టు, టీ20 స్పెషలిస్ట్ ఆటగాళ్లున్నారు. 17వ ఆటగాడికి కూడా కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాం. అయితే అది ఇప్పుడే కాదు. టీ20 ప్రపంచకప్‌ లోపు మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాడిని కాంట్రాక్ట్ ఇస్తాం' అని తెలిపాడు.

ప్రపంచకప్‌కు అనుమానమే:

ప్రపంచకప్‌కు అనుమానమే:

ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డేల్‌ స్టెయిన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కకపోవడంతో.. అతడు మెగా టోర్నీలో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. పొట్టి కప్ కోసమే ఏడాది ఆగస్టులో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన స్టెయిన్‌కు ఇది నిజంగా షాకే. గత కొంతకాలంగా దక్షిణాఫ్రికా టీ20, వన్డే జట్టులో చోటు కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సెలక్టర్లు అతనికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సరైన అవకాశమివ్వకపోవడంతో.. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడి సత్తా నిరూపించుకున్నాడు. ఆ ప్రదర్శనతో ప్రపంచకప్‌పై ఆశలు పెట్టుకోగా.. ఇప్పుడు క్రికెట్ దక్షిణాఫ్రికా మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. మరి ఎం జరుగుతుందో చూడాలి.

పీఎస్ఎల్ వాయిదా పడడంతో:

పీఎస్ఎల్ వాయిదా పడడంతో:

కరోనా కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడడంతో స్టార్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ కూడా ఇంటికి చేరుకున్నాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో స్టెయిన్‌ మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు. 'దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్‌ డికాక్‌ తోడుగా ఉంటే ఆనందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్తా. ఎందుకంటే.. నాకు వంట చేయడం అస్సలు చేతకాదు. అతడు అద్భుతంగా వంట చేస్తాడు. డికాక్‌ చేసే ఏ వంటైనా చాలా బాగుంటుంది' అని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.

 మూడు ఫార్మాట్లలలో కలిపి 699 వికెట్లు:

మూడు ఫార్మాట్లలలో కలిపి 699 వికెట్లు:

గత సంవత్సరం టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగిన స్టెయిన్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు స్టెయిన్‌ తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలలో కలిపి 699 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, March 24, 2020, 15:24 [IST]
Other articles published on Mar 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X