న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డికాక్‌ బాగా చేస్తాడు.. అతడు తోడుగా ఉంటేనే క్వారంటైన్‌కు వెళ్తా: స్టెయిన్‌

Dale Steyn says Would Love To Be In Quarantine With Proper Cook Quinton de Kock

జొహానెస్‌బర్గ్‌: ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరు క్రికెటర్లు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీలు రద్దు కావడంతో క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా భారత పర్యటన మధ్యలోనే రద్దు కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని జట్టు సభ్యులకు సూచించినట్టు క్రికెట్‌ సౌతాఫ్రికా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షుయబ్‌ మంజ్రా చెప్పారు.

జోక్‌ చేస్తున్నారా?.. ఐఓసీపై కశ్యప్‌ ఆగ్రహం!!</a></strong><a class=" title="జోక్‌ చేస్తున్నారా?.. ఐఓసీపై కశ్యప్‌ ఆగ్రహం!!" />జోక్‌ చేస్తున్నారా?.. ఐఓసీపై కశ్యప్‌ ఆగ్రహం!!

డికాక్‌ తోడుగా ఉంటే

డికాక్‌ తోడుగా ఉంటే

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడడంతో స్టార్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ కూడా ఇంటికి చేరుకున్నాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో స్టెయిన్‌ మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు. 'దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్‌ డికాక్‌ తోడుగా ఉంటే ఆనందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్తా. ఎందుకంటే.. నాకు వంట చేయడం అస్సలు చేతకాదు. అతడు అద్భుతంగా వంట చేస్తాడు. డికాక్‌ చేసే ఏ వంటైనా చాలా బాగుంటుంది' అని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.

డికాక్‌ అద్భుతమైన వంటగాడు

డికాక్‌ అద్భుతమైన వంటగాడు

'ఈ ప్రపంచంలో నాకిష్టమైన వ్యక్తుల్లో క్వింటన్‌ ఒకడు. అతడి హోటల్‌ గదిలోకి వెళితే.. చేపలు వేపుతూనో, చేపల పట్టే వీడియోలు చూస్తూనో, చేపల కూర చేసే వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా అతడదే పని చేస్తాడు. వంట చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అతడిలాంటి వాడు నా తోడుగా ఉంటే.. క్వారంటైన్‌ను ఇష్టపడతా. అతడో అద్భుతమైన వంటగాడు. అంతేకాదు మంచి భోజన ప్రియుడు కూడా' అని స్టెయిన్‌ పేర్కొన్నాడు.

వీడియోలు చూస్తా

వీడియోలు చూస్తా

'క్వాంరంటైన్‌ ఖాళీ సమయంలో 1992, 1996, 1999 ప్రపంచకప్‌ వీడియోలు చూస్తా ఎంజాయ్ చేస్తున్నా. బ్రెట్‌ లీ వంటి పేసర్లు ఉన్నారు కాబట్టి 2003 ప్రపంచకప్‌ కూడా ఇష్టమే. అప్పడు బ్రెట్‌ లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నా కెరీర్ అప్పుడప్పుడే మొదలవుతుంది. నేను బ్రెట్‌ లీతో ఆడుతానని, వారిని కలుసుకుంటానని అనుకున్నాను. ఇక 1992 ప్రపంచకప్‌ సమయంలో అప్పుడే క్రికెట్ ఆడడం ఆరంభించాను' అని స్టార్ పేసర్‌ తెలిపాడు.

డివిలియర్స్‌ నా అభిమాన క్రికెటర్

డివిలియర్స్‌ నా అభిమాన క్రికెటర్

'దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ నా అభిమాన క్రికెటర్. అతడో అద్భుత ఆటగాడు. మంచి స్నేహితుడు. అతడు క్రీజులో ఉంటే.. పరుగులు అవే వస్తుంటాయి. మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగలడు' అని స్టెయిన్‌ అన్నాడు. గత సంవత్సరం టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగిన స్టెయిన్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్‌లలో ఆడుతున్నాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.

Story first published: Friday, March 20, 2020, 10:19 [IST]
Other articles published on Mar 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X