రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన డేల్‌ స్టెయిన్‌

Dale Steyn Back in the South Africa ODI Squad After Two Years

హైదరాబాద్: దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్‌ స్టెయిన్‌ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. సెప్టెంబర్ 30 నుంచి జింబాబ్వేతో దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఇందు కోసం ఎంపిక చేసిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో స్టెయిన్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు.

ఆసియా కప్‌‌లో కొత్త జెర్సీల్లో మెరవనున్న పాక్, బంగ్లా ఆటగాళ్లు

గత కొన్ని ఏళ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్టెయిన్ శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్సన చేశాడు. అయితే 2019 వరల్డ్ కప్ దృష్ట్యా జింబాబ్వే సిరీస్‌కు 35 ఏళ్ల స్టెయిన్‌ను పరీక్షించేందుకు దక్షిణాఫ్రికా సెలక్షన్‌ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా సెలక్షన్‌ కన్వీనర్‌ లిండా జోండి మాట్లాడుతూ "జింబాబ్వే సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంకతో కీలక సిరీస్‌లు ఉన్నాయి. ఈ సిరీస్‌లతో ప్రపంచకప్‌ కోసం బలమైన జట్టును తయారు చేసుకోవచ్చు. అన్ని రకాలు ప్రయోగాలు చేసాం. ఎవర ప్రపంచకప్‌ వరకు ఆడే సత్తా ఉందో ఈ సిరీస్‌లతో తేలిపోతుంది" అని అన్నారు.

"కెప్టెన్‌ డుప్లెసిస్‌కు శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా భుజానికి గాయమైంది. జింబాబ్వే సిరీస్‌ ప్రారంభం వరకు కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఒక వేళ కోలుకోకుంటే ఆ సిరీస్‌కు నాయకత్వం వహించేది ఎవరనేది త్వరలో చెపుతాం" అని చెప్పుకొచ్చారు.

వన్డే జట్టు:
Faf du Plessis (c), Hashim Amla, JP Duminy, Reeza Hendricks, Imran Tahir, Christiaan Jonker, Heinrich Klaasen, Keshav Maharaj, Aiden Markram, Wiaan Mulder, Lungisani Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Dale Steyn, Khaya Zondo

టీ20 జట్టు:
Faf du Plessis (c), Gihahn Cloete, Junior Dala, Quinton de Kock, JP Duminy, Robbie Frylinck, Imran Tahir, Christiaan Jonker, Heinrich Klaasen, David Miller, Lungisani Ngidi, Dane Paterson, Andile Phehlukwayo, Tabraiz Shamsi, Rassie van der Dussen

షెడ్యూల్ వివరాలు:
September 30:
1st ODI, Diamond Oval, Kimberley (Day)
October 3: 2nd ODI, Mangaung Oval, Bloemfontein (D/N)
October 6: 3rd ODI, Eurolux Boland Park, Paarl (D/N)

October 9: 1st T20I, Buffalo Park, East London (D/N)
October 12: 2nd T20I, Senwes Park, Potchefstroom (D/N)
October 14: 3rd T20I, Willowmoore Park, Benoni (Day)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Saturday, September 15, 2018, 11:20 [IST]
  Other articles published on Sep 15, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more