న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-పాక్ మ్యాచ్.. ధోనీని అధిగమించిన 'హిట్ మ్యాన్‌'

ICC Cricket World Cup 2019 : Rohit Sharma Breaks MS Dhoni’s Record For Sixes || Oneindia Telugu
CWC19, India vs Pakistan: Most number of sixes, India Openar Rohit Sharma shatters MS Dhoni’s massive record

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ 'హిట్ మ్యాన్‌' రోహిత్‌ శర్మ సెంచరీ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడి ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో సెంచరీ అందుకున్నాడు. పాక్‌ బౌలర్‌ షెహదాబ్‌ ఖాన్‌ వేసిన 30 ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి రోహిత్‌ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం స్కోర్ వేగం పెంచే క్రమంలో పెవిలియన్ చేరాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ధోనీని అధిగమించాడు:

ధోనీని అధిగమించాడు:

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్‌ మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందువరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్‌లలో కలిపి) భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా ధోనీ (355) ఉన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ (358) మూడు సిక్సర్లు బాది ధోనీ రికార్డును అధిగమించాడు.

మూడో స్థానంలో సచిన్‌:

మూడో స్థానంలో సచిన్‌:

అత్యధిక సిక్స్‌లు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితాలో రోహిత్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సచిన్‌ టెండూల్కర్ (264), యువరాజ్‌ సింగ్‌ (251), సౌరవ్‌ గంగూలీ (247), వీరేంద్ర సెహ్వాగ్‌ (243)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ డకౌట్ అయ్యాడు. ఇద్దరి మధ్య కేవలం మూడు సిక్స్‌లు మాత్రమే అంతరం ఉండడంతో.. ధోనీ మళ్లీ రోహిత్‌ను అధిగమించే అవకాశం ఉంది.

ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ:

ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ:

ఈ సెంచరీ రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి సెంచరీ అందుకున్నాడు. అయితే ఈ సెంచరీ రోహిత్‌కు ఓవరాల్‌ ప్రపంచకప్‌లో మూడో సెంచరీ. తొలి శతకం 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై చేసాడు. ఇక ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై రెండో సెంచరీ. దీంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై రెండు సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు సాధించాడు.

203 ఇన్నింగ్‌లలోనే 24 సెంచరీలు:

203 ఇన్నింగ్‌లలోనే 24 సెంచరీలు:

ఇక 203 ఇన్నింగ్‌లలోనే రోహిత్ 24 సెంచరీలు అందుకున్నాడు. దీంతో అతి తక్కువ ఇన్నింగ్‌లలో 24 శతకాలు అందుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. హాషీమ్‌ ఆమ్లా (142 ఇన్నింగ్‌లు), విరాట్‌ కోహ్లీ (161 ఇన్నింగ్‌లు), ఏబీ డివిలియర్స్‌ (192 ఇన్నింగ్‌లు) రోహిత్ కంటే ముందు ఉన్నారు.

Story first published: Monday, June 17, 2019, 9:28 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X