న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెప్పారిలా!: రైనా నుంచి రహానే వరకు

 CWC19: From Suresh Raina to Ajinkya Rahane, Indian cricketers send wishes for the team

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. టోర్నీలో భాగంగా కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

నిజానికి వరల్డ్‌కప్ ప్రారంభమై వారం రోజులైనా భారత అభిమానులకు మాత్రం అసలు సిసలైన మజా బుధవారం నుంచే మొదలవుతుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ని సఫారీలతో తలపడుతుంది. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో తొలి పోరుతో వరల్డ్‌కప్ వేటను కోహ్లీసేన మొదలుపెట్టనుంది.

2011 వరల్డ్‌కప్ అద్భుతాన్ని మరోసారి పునరావృతం చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో చివ‌రి మ్యాచ్‌కు దూర‌మైన ఆమ్లా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఐడెన్‌ మార్క్‌రమ్ బెంచ్ కి పరిమితమయ్యాడు.

{headtohead_cricket_3_6}

ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా మరో స్పిన్నర్ ను తీసుకుంది. భారత్ నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ను తీసుకుంది. టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలతో బరిలోకి దిగుతోంది. షమీ, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇప్పటికే రెండు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సౌతాఫ్రికా ప్ర‌పంచ‌క‌ప్‌లో బోణీ చేయాలని చూస్తోంది.

మరోవైపు ఆరంభ మ్యాచ్‌లో విజ‌యంతో టోర్నీని ఆరంబించాలని భారత్ భావిస్తోంది. వర్షం కారణంగా మంగళవారం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే వీలుంది. ఈ కారణంతోనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే.

1
43651

అయితే చల్లని వాతావరణం మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు. ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో నాలుగు సార్లు తలపడగా.. భారత్‌ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలు గెలిచారు.

Story first published: Wednesday, June 5, 2019, 16:02 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X