న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

55 పరుగులకే 3 వికెట్లు: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన క్రిస్ గేల్

CWC 2109: Chris gayle breaks sri lanka cricket sangakkara record most runs against england

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

1
43662

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో ఓపెనర్లుగా క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 36 పరుగులు చేయడంతో వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర రికార్డుని బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్‌పై గేల్‌ సాధించిన పరుగులు 1632

వన్డేల్లో ఇంగ్లాండ్‌పై గేల్‌ సాధించిన పరుగులు 1632 కాగా, కుమార సంగక్కర(1625) పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగుల సాధించిన కుమార సంగక్కర రికార్డుని గేల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్‌పై ఈ పరుగులు చేయడానికి గేల్‌కు 34 ఇన్నింగ్స్‌లు పట్టగా, సంగక్కరకు 41 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ఆరంభంలోనే విండిస్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్ బౌలర్లు

ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌(1619), రికీ పాంటింగ్‌(1598), మహేలా జయవర్థనే(1562)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్‌ ఆరంభంలోనే ఎవిన్‌ లూయిస్‌(2) వికెట్‌ను కోల్పోయింది. క్రిస్‌ వోక్స్‌ వేసిన మూడో ఓవర్‌ ఆఖరి బంతికి లూయిస్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

భారీ షాట్ ఆడి ఔటైన క్రిస్ గేల్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాయ్‌ హోప్‌‌తో కలిసి క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. అయితే జట్టు స్కోరు 54 పరుగుల వద్ద ఉండగా క్రిస్ గేల్‌(36; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫ్లంకెట్ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని భారీ షాట్‌కు యత్నించి బెయిర్‌స్టో చేతికి చిక్కాడు.

55 పరుగులకే మూడు వికెట్లు

ఆ తర్వాత ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన రెండో బంతికి తడబడుతున్న షాయ్ హోప్(11) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి వెస్టిండిస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండిస్ 3 వికెట్లకు 79 పరుగులు చేసింది. పూరన్(13), హెట్‌మైర్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Friday, June 14, 2019, 16:56 [IST]
Other articles published on Jun 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X