న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ స్పెషల్: ఐసీసీ టోర్నీలంటే చాలు శివమెత్తే శిఖర్ ధావన్

ICC Cricket World Cup 2019 : Shikhar Dhawan Maintains Impeccable Record In ICC Events || Oneindia
CWC 2019: Shikhar Dhawan, the big stage man returns with a bang against Australia

హైదరాబాద్: శిఖర్ ధావన్... తన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన క్రికెటర్. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 187 పరుగులతో సెంచరీ సాధించాడు. ఐసీసీ టోర్నీలంటే చాలు ధావన్ ఆట తీరే పూర్తిగా మారిపోతుంది. అంతకముందు వరకు ఫామ్‌లో లేకున్నా ఐసీసీ టోర్నీల్లో మాత్రం అనూహ్యంగా చెలరేగిపోతాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

2015 వరల్డ్‌కప్‌తో పాటు 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో సైతం ధావన్ చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచిన శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోఅద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ధావన్‌కి ఇది 6వ సెంచరీ

ధావన్‌కి ఇది 6వ సెంచరీ

ఐసీసీ టోర్నీల్లో ధావన్‌కి ఇది 6వ సెంచరీ. ఐసీసీ నిర్వహించే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ లాంటి టోర్నీల్లో ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్‌లాడిన ధావన్‌ 65.15 యావరేజితో 1238 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో ధావన్‌ పరుగుల వరద పారించాడు.

ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు

ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు

కౌల్టర్‌ నైల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్‌ 14 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొవైపు రోహిత్‌ శర్మ అతడికి సహకారం అందిస్తు హాఫ్ సెంచరీ సాధించాడు.

127 పరుగుల భాగస్వామ్యం

127 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరి జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్‌ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ధావన్ తనదైన షాట్లు ఆడుతూ 33వ ఓవర్లో 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఐసీసీ టోర్నీల్లో ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ప్రమాదకరంగా మారిన ధావన్‌ను స్టార్క్ ఔట్ చేశాడు.

టైమింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం

టైమింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం

పవర్ కంటే కూడా టైమింగ్‌ను నమ్మి బ్యాటింగ్ చేసే ఆటగాడు ధావన్. ప్రతిసారీ బంతిని కవర్స్‌లోకి నెట్టి పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్ అందుకు భిన్నంగా సాగింది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ధావన్ పరుగులు పిండుకున్నాడు.

చివరి 10 ఓవర్లో 116 పరుగులు

చివరి 10 ఓవర్లో 116 పరుగులు

చివరి 10 ఓవర్లలో టీమిండియా బ్యాట్స్‌మన్ 116 పరుగులు రాబట్టారు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో సిక్సర్‌తో మోత మొదలెట్టాడు. హాఫ్ సెంచరీ అనంతరం కోహ్లీ కూడా దూకుడు పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో జట్టు స్కోరు 300 దాటింది.

గురువారం న్యూజిలాండ్‌తో

గురువారం న్యూజిలాండ్‌తో

40 ఓవర్లు ముగిసేసరికి 236/2తో ఉన్న భారత జట్టు స్కోరు చివరి 10 ఓవర్లలో 116 పరుగులు రాబట్టారు. టో్ర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో గురువారం నాటింగ్ హామ్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ధావన్ ఏవిధంగా చెలరేగుతాడో చూడాలి మరి.

Story first published: Monday, June 10, 2019, 14:50 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X