న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: 'ఇంగ్లాండ్‌ని ఓడించే సత్తా మా బౌలర్లకు ఉంది'

CWC 2019: Pakistan have the ability to beat England, says Azhar Mahmood

హైదరాబాద్: ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ని ఓడించే సత్తా తమ జట్టుకు ఉందని పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా సోమవారం ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో అజహర్ మహ్మద్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌పై గెలుస్తాం. ఇంగ్లాండ్‌ను ఓడించే అన్ని వనరులు మా జట్టులో ఉన్నాయి. ఇంగ్లండ్‌పై మాదే పైచేయి అవుతుందని భావిస్తున్నా. కచ్చితంగా ఇంగ్లాండ్‌పై గెలుస్తాం. ఆ సత్తా మా క్రికెటర్లలో ఉంది" అని అన్నాడు.

4-0తో పాక్ సిరిస్‌ను చేజార్చుకోవడంపై

4-0తో పాక్ సిరిస్‌ను చేజార్చుకోవడంపై

వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో పాకిస్థాన్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత జరిగిన మిగతా నాలుగు వన్డేల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ సిరిస్‌ ఓటమికి గల కారణాలను అజహర్ మహ్మద్ విశ్లేషించాడు.

ఆతిథ్య జట్టుతో పోటీపడి పరుగులు

ఆతిథ్య జట్టుతో పోటీపడి పరుగులు

"వన్డే సిరిస్‌ను గమినిస్తే మేం ఆతిథ్య జట్టుతో పోటీపడి పరుగులు సాధించాం. మొత్తంగా సిరీస్‌ను కోల్పోయినా ఆ జట్టుకు మా జట్టుకు ఉన్న పరుగుల వ్యత్యాసం పెద్ద ఎక్కువేమీ కాదు. కేవలం మా ఫీల్డింగ్‌ పేలవంగా ఉండటంతో పాటు బౌలింగ్‌లో అదనపు బౌన్స్‌ రాకపోవడం వల్లే సిరీస్‌ కోల్పోయాం" అని తెలిపాడు.

విఫలం కావడానికి కారణమిదే

విఫలం కావడానికి కారణమిదే

"మా బౌలింగ్‌ విఫలం కావడానికి అనుభవం లేని ఆటగాళ్లు జట్టులో ఉండటమే కారణం. ప్రస్తుతం ఉన్న జట్టు బౌలింగ్ విభాగానికి సంబంధించి సీనియర్‌ ఆటగాళ్లు వచ్చారు. పది వికెట్లు తీయడానికి పది మంచి బంతులు పడితే సరిపోతుంది" అని అజహర్‌ మహ్మద్‌ అన్నాడు. గత జూన్‌లో ఇంగ్లాండ్ 481 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

అత్యధిక స్కోరు ఇదే

అత్యధిక స్కోరు ఇదే

వన్డే క్రికెట్‌లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. దీనిపై అజహర్ మహ్మద్ మాట్లాడుతూ "480 పరుగులు చేసిన పిచ్ వరల్డ్ రికార్డు పిచ్. ఈ రికార్డు సాధించడానికి ఇంగ్లాండ్ 300 బంతులను ఎదుర్కొంది. అయితే, ఇక్కడ 10 మంచి బంతులు చాలు 10 వికెట్లను తీయడానికి" అని అన్నాడు.

షార్ట్ పిచ్ బంతులను వేశాం

షార్ట్ పిచ్ బంతులను వేశాం

"పాక్ ఆడిన గత మ్యాచ్‌ని చూస్తే ఎక్కువగా షార్ట్ బంతులను వేయడం జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే చేస్తాం. ప్రస్తుతం జట్టులో 140 స్పీడ్‌తో బౌలింగ్ చేయగలిగిన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా మా బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తారు" అని అజహర్ మహ్మద్ తెలిపాడు.

Story first published: Monday, June 3, 2019, 15:41 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X