న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ సెంచరీ: వరల్డ్‌కప్‌లో భారత్ బోణి, దక్షిణాఫ్రికాపై ఘన విజయం

ICC Cricket World Cup 2019 : India Thrash South Africa By 6 Wickets
Rohit Sharma

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ చేసింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియాలో రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 22 సెంచరీల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. భారత జట్టులో శిఖర్ ధావన్(8), కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), లోకేశ్ రాహుల్(26), ధోనీ(34), పాండ్యా(15) పరుగులు చేశారు.

సఫారీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా.. మోరిస్‌, ఫెలుక్వాయో తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు తాజా ఓటమితో దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.


టీమిండియా విజయ లక్ష్యం 228
వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు చాహల్ (51/4), బుమ్రా(35/2), భువీ(2/44) విజృంభణతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 54 బంతుల్లో 38(4ఫోర్లు), డుస్సెన్(22), డేవిడ్ మిల్లర్(31), ఫెలుక్వాయో(34) ఫరవాలేదనిపించారు. చివర్లో క్రిస్‌ మోరీస్(42), కగిసో రబాడ(31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో 220కి పైగా స్కోరు చేసింది. సపారీల బ్యాటింగ్‌ను చూసి ఒకానొక దశలో 130కే ఆలౌట్ అవుతుందని భావించారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆరంభంలోనే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని ఆడిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా(6) రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సఫారీలు తమ తొలి వికెట్‌ను కోల్పోయారు.

1
43651

ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్‌లోనే మరో ఓపెనర్ డికాక్(10) పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యారు. ఓపెనర్ల వికెట్లను చేజార్చుకున్న సౌతాఫ్రికా కొద్దిసేపు నిలకడగా ఆడింది. డుప్లెసిస్, డుస్సెన్ భారీ షాట్లకు ప్రయత్నించకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో చాహల్ వీరిద్దరినీ పెవిలియన్‌కు చేర్చాడు. చాహల్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని డుస్సెన్(22) రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి బౌల్డయ్యాడు.

ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి డుప్లెసిస్(38)ను చాహాల్ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన జేపీ డుమినీని(3) కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడటానికి తడబడిన డుమినీ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

ఆ తర్వాత ఫెలుక్వాయో 61 బంతుల్లో 34(2 ఫోర్లు, 1 సిక్స్) ఫరవాలేదనిపించగా... చివర్లో క్రిస్ మోరిస్ 34 బంతుల్లో 42(1 ఫోర్లు, 2 సిక్సులు), కగిసో రబాడ 35 బంతుల్లో 31(2 పోర్లు) నిలకడగా ఆడటంతో సఫారీలు రెండొందల పరుగుల మార్క్‌ని అందుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీయగా, బుమ్రాకు రెండు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ లభించింది.

{headtohead_cricket_3_6}

Story first published: Wednesday, June 5, 2019, 23:07 [IST]
Other articles published on Jun 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X