న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జావేద్ మియాందాద్ రికార్డు బద్దలు: చరిత్ర సృష్టించిన బాబర్ అజాం

CWC 2019: Babar Azam has now scored more runs than any other Pakistani at a single World Cup

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ అజాం 99 బంతుల్లో 96(11 ఫోర్లు) చేసి మొహమ్మద్ సైపుద్దీన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తద్వారా ఒక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ 437 పరుగుల రికార్డుని అధిగమించాడు. 1992 ప్రపంచకప్‌లో జావేద్ మియాందాద్ ఈ పరుగులు సాధించాడు.

ఈ ప్రపంచకప్‌లో బాబర్ ఆజాం అద్భుతమైన ఫామ్‌ను కనబర్చాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజాం 474 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 101 నాటౌట్. ప్రస్తుతం 36 ఓవర్లకు గాను పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

క్రీజులో ఇమామ్ ఉల్ హాక్(79), మహ్మద్ హఫీజ్(8) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు స్కోరు 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సైఫుద్దీన్ వేసిన ఎనిమిదో ఓవర్లో పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్(13) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడంలో ఫకార్ జమాన్ విఫలమయ్యాడు.

Story first published: Friday, July 5, 2019, 17:45 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X