న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హమ్మయ్య.. జేసన్ రాయ్‌ ఔట్‌

CWC 19: India vs England Match: Bairstow and Roy smashed 160 after England opted to bat, Kuldeep Yadhav gets rid of Jason Roy

ఇంగ్లాండ్ విధ్వంసక ఓపెనర్ జేసన్ రాయ్‌ (66; 57బంతుల్లో 7×4, 2×6) ఔట్‌ అయ్యాడు. దీంతో భారత అభిమానులు అందరూ హమ్మయ్య అని అంటున్నారు. ఎందుకంటే క్రీజులో దిగింది మొదలు వీరబాదుడుతో స్కోరును పరుగులు పెట్టించాడు కాబట్టి. బౌండరీలు, సిక్సర్లే లక్ష్యంగా ఆడిన రాయ్‌ను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఔట్ చేసాడు. కుల్దీప్ వేసిన 23వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడగా.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్ రవీంద్ర జడేజా అద్భుత క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ చేరాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జేసన్ రాయ్‌ను అవుట్ చేసి 160 పరుగుల భారీ భాగస్వామ్యానికి కుల్దీప్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. అయితే మరో ఓపెనర్ బెయిర్‌స్టో కూడా ధాటిగా ఆడుతున్నాడు. అతనికి తోడు రూట్‌ క్రీజులో ఉన్నాడు. బెయిర్‌స్టో, రూట్‌ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 28 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (109), రూట్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బెయిర్‌స్టో, జేసన్ రాయ్‌ బౌండరీల వర్షం కురిపించారు. భారత్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ వేగంగా పరుగుల వరద పారించారు. దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. రాయ్‌ మీడియం పేసర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రాయ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్సర్ల వర్షం కురిపిస్తూ హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Sunday, June 30, 2019, 17:14 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X