న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో.. భారత్ లక్ష్యం 338

CWC 19: India vs England: India set 338 after Stokes blitz, Shami bagged five to help India fight back in the game after Bairstow ton

ప్రపంచ‌కప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసి భారత్ ముందు 338 పరుగుల లక్ష్యంను ఉంచింది. ఇంగ్లండ్ జట్టులోని ప్రతీ బ్యాట్స్‌మన్‌ బ్యాట్ జులిపించడంతో పరుగుల వరద పారింది. ఓపెనర్ బెయిర్‌స్టో (100: 90 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు శతకం చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అదిరే ఆరంభం:

అదిరే ఆరంభం:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు జాసన్ రాయ్ (66), జానీ బెయిర్‌స్టో (111)లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి ఇన్నింగ్స్ ఆరంభం నుండే భారత బౌలర్లను బెంబేలెత్తించారు. ఇద్దరూబౌండరీలు బాదడంలో పోటీ పడడంతో పరుగుల వరద పారింది. వికెట్లు తీసేందుకు కెప్టెన్ కోహ్లీ బౌలర్లను మార్చినా.. ఫలితం లేకుండా పోయింది.

తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర:

జేసన్ రాయ్‌ మీడియం పేసర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ అయినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో రాయ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్సర్ల వర్షం కురిపించాడు. బెయిర్‌స్టో స్పిన్నర్ చాహల్‌ వేసిన 16వ ఓవర్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ చేరుకున్నాడు. 17ఓవర్లో రాయ్‌ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 400 పరుగులు దాటుతుందని భావించారు. చివరికి కుల్దీప్ యాదవ్.. జాసన్ రాయ్‌ (66; 57బంతుల్లో 7×4, 2×6)ను ఔట్ చేసి 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు.

షమీ విజృంభణ:

మరోవైపు క్రీజులో పాతుకుపోయిన బెయిర్‌స్టో సెంచరీ (111; 109బంతుల్లో 10×4, 6×6)తో చెలరేగాడు. రూట్ అతనికి చక్కటి సహకారం అందించాడు. అయితే మహ్మద్ షమీ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ పరుగుల వేగం తగ్గింది. షమీ వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. బెయిర్‌స్టోను తొలుత వెనక్కి పంపిన షమీ.. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (1), జో రూట్ (44), జోస్ బట్లర్ (20), క్రిస్ వోక్స్ (7)లను పెవిలియన్ పంపాడు. అయితే క్రీజులో ఉన్న స్టోక్స్‌ (79; 54బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్‌ 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసాడు.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Sunday, June 30, 2019, 19:24 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X