న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ ఢీ.. గెలిచిన జట్టు సెమీస్‌కు

ICC Cricket World Cup 2019 : England vs New Zealand Match Preview ! || Oneindia Telugu
CWC 19, England vs New Zealand Match Preview: Predicted Playing XI, Weather, Pitch Report

చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సెమీఫైనల్‌ రేసులో ఉన్న ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌లకు అసలు పరీక్ష. సెమీస్‌ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి. అయితే ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని కచ్చితంగా చెప్పలేం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఓడినా సెమీస్‌ అవకాశాలు:

ఓడినా సెమీస్‌ అవకాశాలు:

ఈ మ్యాచ్‌లో ఓడినా ఈ రెండు జట్లకు సెమీస్‌ అవకాశాలు మాత్రం పూర్తిగా మూసుకుపోవు. కానీ.. ముందుకెళ్లేది లేనిది వేరే జట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓడితే.. పాకిస్థాన్‌కు లాభం. ఎందుకంటే పాక్‌ తర్వాత బంగ్లాదేశ్‌పై నెగ్గితే ఆ జట్టు ఇంగ్లాండ్‌ను దాటి టాప్‌-4లో నిలిచే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 10 పాయింట్లతో ఉండగా.. పాక్‌ 9 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్‌పై కివీస్‌ గెలిస్తే.. 13 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్‌ చేరుతుంది. ఒకవేళ కివీస్‌ ఓడినా 11 పాయింట్లతో ఆ జట్టుకు ఇంకా సెమీస్‌ అవకాశం ఉంటుంది.

ఇంగ్లండ్‌కు అగ్నిపరీక్ష:

ఇంగ్లండ్‌కు అగ్నిపరీక్ష:

ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కు అగ్ని పరీక్షే. గెలిస్తేనే ముందుకెళ్లే వీలుంటుంది. టీమిండియాపై సమిష్టి కృషితో గెలిచిన స్ఫూర్తితో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు పరాజయాలతో ఇంగ్లండ్‌ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినా.. టీమిండియాపై మంచి విజయం సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్, బెయిర్‌ స్టో ఫామ్ అందుకున్నారు. వీరు క్రీజులో ఉంటే పరుగుల వరదే. ఇక రూట్‌ నిలకడ చూపుతున్నా.. మోర్గాన్, బట్లర్‌ గాడిలో పడాల్సి ఉంది. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఫామ్‌ కలిసొచ్చే అంశం. పేసర్లు ఆర్చర్, వుడ్‌ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ప్లంకెట్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. వీరికి తోడు వోక్స్, స్టోక్స్‌, రషీద్ ఉన్నారు. అందరూ రాణిస్తే కివీస్ పరుగులు చేయడం కష్టమే.

విలియమ్సన్, టేలర్‌లపైనే ఆధార పడుతోంది:

విలియమ్సన్, టేలర్‌లపైనే ఆధార పడుతోంది:

ఆస్ట్రేలియా మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సాధారణ పరుగులను కూడా ఛేదించలేక 157 పరుగులకే ఆలౌట్ అయింది. అన్ని విభాగాల్లో విఫలమయి సెమీస్ బెర్త్ దూరం చేసుకుంది. అయితే కీలక మ్యాచ్ కాబట్టి సమిష్టిగా రాణించాల్సిందే. కివీస్‌ ప్రధానంగా విలియమ్సన్, టేలర్‌లపైనే ఆధార పడుతోంది. ఓపెనర్లు గుప్తిల్, నికోల్స్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ఇది కివీస్‌ను కలవరపెట్టే అంశం. లాతమ్ పరుగులే చెయ్యట్లేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ గ్రాండ్ హోమ్, నీషంలు ఆదుకుంటున్నారు. ఇక బౌలింగ్‌లో బోల్ట్, ఫెర్గుసన్, శాంట్నర్ చెలరేగుతున్నారు.

Teams Probable XI:

England: Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan, Ben Stokes, Jos Buttler, Chris Woakes, Mark Wood, Jofra Archer, Liam Plunkett, Adil Rashid.

New Zealand: Henry Nicholls, Martin Guptill, Kane Williamson, Ross Taylor, Tom Latham, Colin de Grandhomme, Jimmy Neesham, Mitchell Santner, Ish Sodhi/Tim Southee, Lockie Ferguson, Trent Boult.

1
43684

{headtohead_cricket_2_4}

Story first published: Wednesday, July 3, 2019, 9:55 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X