న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై బౌలర్లను బచ్చాగాళ్లుగా ట్రీట్ చేసిన లక్నో లెవిస్: ఏం చెప్పాడంటే? వింటే ..మండిపోతుందంతే

Evin Lewis Trolled Chennai Super Kings Bowlers By Calling Them As Kids

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయింది. టైటిల్ హాట్ ఫేవరెట్, తనకంటే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. 211 పరుగుల లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది. ఐపీఎల్ ఫార్మట్‌కు తగ్గట్టుగా సత్తా చాటారు లక్నో జెయింట్ బ్యాటర్లు.

సమష్టిగా రాణించిన బ్యాటర్లు..

సమష్టిగా రాణించిన బ్యాటర్లు..

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప-50, శివమ్ దుబే -49, మొయిన్ అలీ-35, అంబటి రాయుడు-27 రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో19.3 ఓవర్లలో 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 211 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్-55, ఓపెనర్ క్వింటన్ డికాక్- 61 జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో ఆయుష్ బదోని తొమ్మిది బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేయడం జట్టు విజయానికి బాటలు వేసింది.

సునామీ లెవిస్..

సునామీ లెవిస్..

లక్నో ఇన్నింగ్‌లో ఇవాన్ లెవిస్ బ్యాటింగ్ హైలైట్. వన్‌డౌన్ బ్యాటర్ మనీష్ పాండే అవుటైన తరువాత నంబర్ 3లో బ్యాటింగ్ దిగాడతను. అప్పటికి జట్టు స్కోరు 11.2 ఓవర్లల్లో 106 పరుగులు. బ్యాటింగ్‌కు దిగడంతోనే స్కోర్‌బోర్డుకు పని చెప్పాడు. 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోలేదు. పేసరా, స్పిన్నరా అనేది చూల్లేదు. మూడు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.

మ్యాచ్‌కు ముందు రాహుల్ వార్నింగ్..

మ్యాచ్‌కు ముందు రాహుల్ వార్నింగ్..

మ్యాచ్ ఆరంభం కావడానికి ముందే కేఎల్ రాహుల్.. లెవిస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఓపెనింగ్‌ వద్దని సూచించాడు. తాను, క్విన్నీ (క్వింటన్ డికాక్) ఇన్నింగ్‌ను ఆరంభిస్తామని, మూడో స్థానంలోకి బ్యాటింగ్‌కు రావాలనీ లెవిస్‌కు కరాఖండిగా చెప్పాడు. దీనికి కారణం లేకపోలేదు. ఫాస్ట్, మీడియం పేస్ బౌలింగ్‌తో కంపేర్ చేస్తే- లెవిస్ స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో కొంత ఇబ్బంది పడతాడు. స్పిన్నర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కొనలేడు. ఈ కారణంతోనే కేఎల్ రాహుల్- అతన్ని ఓపెనింగ్ జోడీగా పంపించడానికి ఇష్టపడలేదు.

తేలిగ్గా తీసుకున్న లెవిస్..

తేలిగ్గా తీసుకున్న లెవిస్..

తన కేప్టెన్ ఇచ్చిన వార్నింగ్‌ను అతను లైట్‌గా తీసుకున్నాడు. బౌలర్ ఎవరైనా సరే.. తన ముందు పిచ్ అయిన బంతిని కొడితే- స్టేడియం అవతల పడాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఫాస్ట్ బౌలింగా.. స్పిన్ బౌలింగా అనేది తాను చూడట్లేదని, బౌలర్ వేసిన బాల్‌ను ఎలా సిక్సర్‌గా మలచాలనేది మాత్రమే తాను ఆలోచిస్తానని స్పష్టం చేశాడు. దాన్ని చేతల్లో చేసి చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ బౌలింగ్‌నూ ఉతికి ఆరేశాడు.

జడేజా.. మొయిన్ అలీ నుంచి..

లెవిస్ దెబ్బకు రవీంద్ర జడేజా వంటి బౌలర్.. బంతిని ముట్టుకోవడానికి బెదిరిపోయాడు. రెండు ఓవర్లతోనే సరిపెట్టుకున్నాడు. రెండు ఓవర్లల్లో 21 పరుగులను ఇచ్చుకున్న జడేజా.. తన కోటా బౌలింగ్‌ను పూర్తి చేయడానికి వెనకాడాడు. ఒక ఓవర్‌ను ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీతో వేయించాడు. అక్కడా రిజల్ట్ మారలేదు. మొయిన్ అలీ వేసిన ఓవర్‌లో 14 పరుగులను రాబట్టుకున్నారు. మరో ఓవర్‌ను శివం దుబే చేతికి ఇవ్వగా.. అది కాస్తా ఫలితాన్నే మార్చివేసింది.

Story first published: Friday, April 1, 2022, 11:12 [IST]
Other articles published on Apr 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X