న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్‌లిన్‌ అర్ధ శతకం.. చెన్నై టార్గెట్ 162

CSK vs KKR: Imran Tahir has bagged four wickets, KKR hits 161 runs

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ సీజన్-12లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి.. చెన్నై ముందు 162 పరుగుల లక్ష్యంను ఉంచింది.

శుభారంభం అదిరింది:

శుభారంభం అదిరింది:

చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ క్రిస్ లిన్ శుభారంభం అందించాడు. మొదటి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు సునిల్‌ నరైన్‌ తడబడి త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి లిన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు.

 ఒకే ఓవర్లో 2 వికెట్లు:

ఒకే ఓవర్లో 2 వికెట్లు:

క్రిస్ లిన్ బౌండరీలతో విరుచుకుపడుతూ 50 (36 బంతుల్లో 7x4, 2x6) అర్ధ సెంచరీ చేసాడు. ఐపీఎల్‌లో క్రిస్‌ లిన్‌కు ఇది 8వ అర్ధ సెంచరీ. తాహీరో బౌలింగ్‌లో నితీశ్ రానా (21) డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే రాబిన్ ఊతప్ప (0) డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో లిన్ భారీ షాట్లు ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. ఇదే ఊపులో తాహీర్ వేసిన 15వ ఓవర్‌లో శార్ధూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి లిన్‌ (82) అవుట్ అయ్యాడు.

చివరి ఓవర్లలో కోల్‌కతా తడబాటు:

చివరి ఓవర్లలో కోల్‌కతా తడబాటు:

అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన రస్సెల్ (10) షోరేకి క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి కార్తీక్ (18) డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్లో గిల్ (15), కుల్దీప్ యాదవ్ (0)లు అవుట్ అవ్వడంతో కోల్‌కతా 161 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం బాగున్నా.. చివరి ఓవర్లలో తడబాటు కారణంగా కోల్‌కతా సాధారణ స్కోరుకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తాహీర్ 4, ఠాకూర్ 2, శాంట్నర్ 1 వికెట్ తీశారు.

Story first published: Sunday, April 14, 2019, 18:18 [IST]
Other articles published on Apr 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X