న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాంఖడెలో ధోనికి బ్రహ్మారథం పట్టిన ముంబై అభిమానులు (వీడియో)

Crowd erupts as Dhoni comes to bat at Mumbai

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌కు ఐసీసీకి చెందిన మూడు మేజర్ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. టోర్నీలో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌కి ఇది 100వ విజయం కావడం విశేషం.

3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన చెన్నై

చెన్నై 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్‌ చేసేందుకు గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు ముంబై అభిమానులు ధోని... ధోని అంటూ గట్టిగా అరుస్తూ చప్పట్లు, కేకలు, విజిళ్లతో స్వాగతం పలికారు. డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి ధోని మైదానంలోకి వస్తుంటే వాంఖడేలోని ప్రేక్షకులు ధోని.. ధోని.. హోరెత్తించారు.

170 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై

170 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై

ఈ మ్యాచ్‌లో 170 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాధవ్‌(58)తో కలిసి ధోని(12) నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశారు.

చివర్లో శార్ధూల్ ఠాకూర్ మెరుపులు

చివర్లో శార్ధూల్ ఠాకూర్ మెరుపులు

అయితే, హార్దిక్‌ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ధోని(12), జడేజా(1) పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత లసిత్‌ మలింగ వేసిన 18వ ఓవర్‌లో జాదవ్‌(58), బ్రావో(8) కూడా ఔట్ కావడంతో చెన్నై ఓటమికి చేరువైంది. చివర్లో శార్దుల్‌ ఠాకుర్‌(12) కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ ఓటమి నుంచి చెన్నైని కాపాడలేకపోయాడు.

Story first published: Thursday, April 4, 2019, 18:06 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X