న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా క్రీడల్లో క్రికెట్ రీఎంట్రీ: థాయ్ లాండ్ తలపడనున్న జట్లు

Cricket likely to return to Asian Games in 2022

బ్యాంకాక్: క్రికెట్ అంటే పడి చచ్చే ప్రేక్షకులకు మరో శుభవార్త. నాలుగేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మంగా ఏర్పాటయ్యే ఆసియా క్రీడల్లో క్రికెట్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 2022 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఆడటానికి అనుమతి దాదాపు లభించినట్టే. క్రికెట్ ను పున:ప్రవేశ పెట్టడానికి ఆసియా క్రీడల కమిటీ అంగీకరించింది.

థాయ్ లాండ్ లోని హాంగ్ఝౌలో ఆదివారం ఏర్పాటైన ఒలింపిక్ కౌన్సిల్ ఆసియా విభాగం సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఒలింపిక్ కౌన్సిల్ నిర్వహిస్తోన్న అధికారిక వెబ్ సైట్ insidethegames.biz వెల్లడించింది. 2022 ఆసియా క్రీడలకు థాయ్ లాండ్ ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

ఆసియా క్రీడల్లో టీ20లు..

ఆసియా క్రీడల్లో టీ20లు..

థాయ్ లాండ్ లో 2022లో ఏర్పాటయ్యే ఆసియా క్రీడల్లో టీ20 క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించడానికి అనుమతి రావడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సానుకూలంగా స్పందించింది. ఆసియా క్రీడలకు ఇంకా చాలా సమయం ఉన్నందున.. దీనిపై ఇప్పుడిప్పుడే ఎలాంటి షెడ్యూల్ ను ఖరారు చేయలేమని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఒలింపిక్స్ కౌన్సిల్ ఆసియా విభాగం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ ను పున: ప్రవేశపెట్టినప్పటికీ.. 50 ఓవర్ల మ్యాచ్ లు ఉండవు. టీ20 మ్యాచ్ లను మాత్రమే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

 ఈ సారి నేపాల్, హాంగ్ కాంగ్ కూడా..

ఈ సారి నేపాల్, హాంగ్ కాంగ్ కూడా..

ప్రస్తుతం భారత ఉపఖండంలో మనదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘానిస్తాన్ జట్లు పూర్తిస్థాయిలో క్రికెట్ ఆడుతున్నాయి. 2022 ఆసియా క్రీడల్లో నేపాల్, హాంగ్ కాంగ్ జట్టు కూడా భాగస్వామ్యం అయ్యే వీలుంది. ఈ రెండు జట్లు ఆడటానికి ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

2018లో తొలగింపు..

2018లో తొలగింపు..

ఇండోనేషియాలో ఏర్పాటైన 2018 ఆసియా క్రీడల సందర్భంగా క్రికెట్ ను తొలగించారు. 2010, 2014 ఆసియా క్రీడల బిజీ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఒలింపిక్ కౌన్సిల్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 2018 నాటికి క్రికెట్ లేకుండా ఆసియా క్రీడలను నిర్వహించారు. 50 ఓవర్ల క్రికెట్ ఆడటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుండటం, అందుకు తగినన్ని స్టేడియాలు అందుబాటులో లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ను తొలగించారు.

Story first published: Sunday, March 3, 2019, 16:25 [IST]
Other articles published on Mar 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X