న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్ ఎప్పుడూ కెప్టెన్ వెనుక స్థానంలో ఉండాలి: గంగూలీ

Saurav Ganguly : Cricket Is A Captain's Game Coach Must Take Back Seat
Cricket is a captains game, coach must take back seat

న్యూఢిల్లీ: క్రికెట్ జట్టులో కెప్టెన్.. కోచ్‌ల పాత్ర ఏమిటో గంగూలీ మరోసారి గుర్తు చేశారు. ఫుట్‌బాల్‌లో మాదిరి క్రికెట్లో కోచ్‌లు జట్లపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే కుదరదంటూ టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'క్రికెట్‌ ఫుట్‌బాల్‌‌లా కాదు. ప్రస్తుతం క్రికెట్లో చాలామంది కోచ్‌లు తమ జట్లను ఫుట్‌బాల్‌ టీంల తరహాలో నడిపించాలని చూస్తున్నారు. కానీ క్రికెట్‌ కెప్టెన్‌ ఆట. కోచ్‌లు వెనుక సీట్లో ఉండాలి. అది చాలా కీలకమైన విషయం' అని అతను అన్నాడు.

పుణెలో తన ఆత్మకథ 'ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఒక్కొక్కరిపై దృష్టి పెట్టి వారిని సరైన దారిలో నడిపించడం క్రికెట్‌ కోచ్‌ అతి పెద్ద బాధ్యత అని, ఐతే ఈ లక్షణం ఇప్పటి కోచ్‌ల్లో చాలా తక్కువమందికే ఉందని సౌరభ్‌ అన్నాడు.

ప్రస్తుత టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిని ఓ ప్రశ్న వేయాల్సి వస్తే ఏం అడుగుతారని అడిగితే.. 'ప్రస్తుతం తుది జట్టును ఎవరు ఎంపిక చేస్తున్నారు.. రోహిత్‌ శర్మా? రవిశాస్త్రా' అని గంగూలీ బదులిచ్చాడు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో ఆడుతోన్న భారత్ గెలుస్తుందంటూ గంగూలీ ముందుగానే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

'కేవలం కెప్టెన్ సలహాలు ఇవ్వడానికి మాత్రమే. అంతేకానీ, అంతకు మించి జట్టుపై ప్రభావం చూపెట్టేందుకు ప్రయత్నిస్తే అది గేమ్‌కు నష్టం కలిగేలా చేస్తుంది.' అని గంగూలీ మాట్లాడారు. ఈ పుస్తకాన్ని రాసేందుకు ఆయనతో పాటుగా స్పోర్ట్స్ సీనియర్ రైటర్ గౌతం భట్టాచార్య కూడా సహ రచయితగా 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' రాయడంలో పాలు పంచుకొన్నారు.

Story first published: Tuesday, September 25, 2018, 9:22 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X