న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన గౌరవం: గవాస్కర్ పేరిట అమెరికాలో క్రికెట్ గ్రౌండ్

సునీల్ గవాస్కర్ ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి భారత్ క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అమెరికాలోని ఓ మైదానానికి సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు.

By Nageshwara Rao

హైదరాబాద్: సునీల్ గవాస్కర్ ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి భారత్ క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అమెరికాలోని ఓ మైదానానికి సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు.

తన పేరుతో ఉన్న కెంటకి రాష్ట్రంలోని లూయిస్‌విలెలోని మైదానాన్ని సునీల్ గవాస్కర్ ఇటీవలే ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా 'అమెరికాలోని A మైదానానికి నా పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌కు అంతగా ఆదరణ లేని అమెరికాలో ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది' అని గవాస్కర్ అన్నాడు.

Cricket ground in Kentucky, US named after Sunil Gavaskar

ఇందుకు సంబంధించిన ఫోటోని గవాస్కర్ కుమారుడు రోహన్ గవాస్కర్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. గతంలో వెల్లింగ్టన్‌లోని ఓ మైదానానికి సునీల్ గవాస్కర్ పేరుని పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గవాస్కర్ కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు.

ముంబైలోని వాంఖడె మైదానంలో కూడా గవాస్కర్ పేరిట ఓ స్టాండ్ ఉంది. 'లిటిల్ మాస్టర్' గా పేరుగాంచిన సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10,000 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్. టెస్టుల్లో గవాస్కర్ 30 సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X