న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తీవ్ర గాయాలపాలైన మాజీ క్రికెటర్ ఆసుపత్రిలో...

Cricket great Matthew Hayden suffers spinal injuries while surfing in Queensland

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీక్రికెటర్‌‌, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మాథ్యూ హెడెన్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం హెడెన్‌ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్‌లాండ్‌ దీవులకు హాలిడే ట్రిప్‌ వెళ్లాడు. అక్కడ సరదాగా ఆడిన ఆటే ప్రమాదాన్ని కొని తెచ్చింది.

అక్కడ స్ట్రాడ్‌బ్రోక్‌ ఐస్‌ల్యాండ్‌లో తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్‌ గేమ్‌ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పోయిన హేడెన్‌ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయాలైయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జరిగిన సంగతి మొత్తం హేడెనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. 'జోష్‌తో సర్ఫింగ్‌ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్‌ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను.'అని పేర్కొన్నాడు.

ఆ ఆసియా కప్ కూడా మనదే..!!ఆ ఆసియా కప్ కూడా మనదే..!!

ఆసీస్‌ తరపున 103 వన్డేలు, 161 టెస్ట్‌లు, 9 టీ20లాడిన హెడెన్‌ 2009లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్‌ 2008లో భారత్‌తో తన చివరి వన్డే ఆడాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఆడుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Story first published: Monday, October 8, 2018, 10:36 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X