న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: ‘చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది’.. సూపర్ స్టార్ కృష్ణ మృతిపై హర్ష భోగ్లే సంతాపం..

Cricket commentator Harsha Bhogle reacts on Super Star Krishna death

సూపర్ స్టార్ కృష్ణ.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. సాంకేతికంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన ఈ తెలుగు జేమ్స్‌బాండ్ ఇక లేరు. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి ఆయనకు నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

స్పందించిన హర్ష భోగ్లే..

స్పందించిన హర్ష భోగ్లే..

ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా కృష్ణ మృతిపై స్పందించారు. తను చిన్నతనంలో వెండితెరపై చూసిన మరో తార రాలిపోయిందని భోగ్లే అన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుట్టి పెరిగిన హర్ష భోగ్లేకు తెలుగు చిత్ర పరిశ్రమ సుపరిచితమే. తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగిన తను కృష్ణ మరణంపై సానుభూతి తెలిపారు.

ఏమన్నాడంటే..?

ఏమన్నాడంటే..?

'నా చిన్ననాటి మరో పేరు చెరిగిపోయింది. తెలుగు స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ త్రయంతోపాటు కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్, మోహన్ బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగి తదితరులు నటించిన చిత్రాలు నాకు గుర్తున్నాయి. ఇవన్నీ ముఖ్యంగా దూరదర్శన్‌లో చూసేవాడిని' అని హర్ష భోగ్లే అన్నాడు. సోమవారం నుంచి ఆస్పత్రిలోనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ.. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోలుకోలేదు. మంగళవారం నాడు ఉదయం కన్నుమూశారు.

అభిమానుల రియాక్షన్

అభిమానుల రియాక్షన్

హర్ష భోగ్లేకు కృష్ణ కూడా తెలుసని తెలియని చాలా మంది నెటిజన్లు ఈ ట్వీట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో కృష్ణ వంటి లెజెండరీ నటుడు కన్నుమూయడంతో ఎంతోమంది గుండెలు పగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మరో లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తండ్రి కృష్ణం రాజు కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని సినీ పెద్లలు సంతాపం తెలిపారు.

Story first published: Tuesday, November 15, 2022, 11:00 [IST]
Other articles published on Nov 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X