న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia షెడ్యూల్ విడుదల.. నవంబరు 27న మొదటి వన్డే!!

Cricket Australia revealed the Schedule for India’s tour of Australia
India vs Australia 2020 : Full Schedule & Team India Squad Details || Oneindia Telugu

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 అనంతరం భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా విడుదల చేసింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న జరగనున్న తొలి వన్డేతో పర్యటన ఆరంభం అయి.. 2021, జనవరి 15న నాలుగో టెస్టు మ్యాచ్‌తో ముగుస్తుంది.

ఈ పర్యటనలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరుగనున్నాయి. సిడ్నీలో తొలి వన్డే నవంబరు 27న జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4న, తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న మొదలవనున్నాయి. టెస్ట్ సిరీస్ ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఉన్నాయి. ఐపీఎల్ 2020 నవంబరు 10తో ముగియనుండగా.. యూఏఈ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో ఆస్ట్రేలియాకి భారత ఆటగాళ్లు వెళ్లనున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజులు క్వారంటైన్‌‌లో ఉండి మ్యాచులు ఆడతారు.

వన్డే షెడ్యూల్:
1. తొలి వన్డే నవంబరు 27 - సిడ్నీ
2. రెండో వన్డే నవంబరు 29- సిడ్నీ
3. మూడో వన్డే డిసెంబరు 1- మనుకా ఓవల్

టీ20 షెడ్యూల్:
1. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4 - మనుకా ఓవల్
2. రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6- సిడ్నీ
3.మూడో టీ20 మ్యాచ్ డిసెంబరు 8- సిడ్నీ

ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:
1. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 6- డ్రమ్మోయిన్ ఓవల్, సిడ్నీ
2. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 11- సిడ్నీ- డే/నైట్

టెస్టు షెడ్యూల్:
1. తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న- అడిలైడ్ ఓవెల్- డే/నైట్ టెస్టు
2. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26న- మెల్‌బోర్న్
3. మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7న- సిడ్నీ
4. నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15న- గబ్బా

SRH vs DC: సంప్రదాయ క్రికెట్‌ షాట్లు ఆడటం కష్టం.. అందుకే 360 డిగ్రీల్లో ఆడా: వార్నర్SRH vs DC: సంప్రదాయ క్రికెట్‌ షాట్లు ఆడటం కష్టం.. అందుకే 360 డిగ్రీల్లో ఆడా: వార్నర్

Story first published: Wednesday, October 28, 2020, 14:44 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X