న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై ఏడాది పాటు నిషేధం: హెడ్ కోచ్ రాజీనామా?

By Nageshwara Rao
Cricket Australia dismiss Darren Lehmann reports

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న బాల్ టాంపరింగ్ వివాదంపై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ నిమిత్తం నియమితులైన క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌ కేప్‌టౌన్‌ చేరుకుని బాల్ టాంపరింగ్ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్‌లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా ఆసీస్ హెడ్ కోచ్‌ డారెన్‌ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విచారణ ప్రక్రియను బుధవారానికి పూర్తి చేయనున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వీరిపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సిఫారసు చేయనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బుధవారం వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

శుక్రవారం నుంచి నాలుగో టెస్టు

శుక్రవారం నుంచి నాలుగో టెస్టు

శుక్రవారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కి ముందే విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. అయితే, తాజా సమాచారం ప్రకారం స్మిత్, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌, వార్నర్‌లను కనీసం ఏడాది పాటు సస్పెండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌ డారెన్‌ లీమన్‌ తక్షణమే పదవి నుంచి తప్పిస్తారని మంగళవారం ఆసీస్ మీడియా ప్రధాన కథనాలుగా ప్రచురించింది.

కుట్రలో కోచ్‌ లీమన్‌కు ప్రమేయం కూడా ఉంది

కుట్రలో కోచ్‌ లీమన్‌కు ప్రమేయం కూడా ఉంది

జట్టులోని సీనియర్ ఆటగాళ్లందరం కలిసే టాంపరింగ్ ప్లాన్‌ను అమలు చేసినట్లు మీడియా సమావేశ అనంతరం చెప్పిన స్మిత్... ఇందులో కోచింగ్‌ స్టాఫ్‌ ప్రమేయం లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపే ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్‌ మాట్లాడుతూ 'కుట్రలో కోచ్‌ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్‌ తప్పుచేసినవాడే అవుతాడు' అని అన్నాడు.

నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్‌ రాజీనామా

నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్‌ రాజీనామా

బాల్ టాంపరింగ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్‌(సీఏ).. స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోనుందని అందులో పేర్కొన్నాయి. మరోవైపు శుక్రవారం ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందే లీమన్‌ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది.

మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా చేతికి రిపోర్ట్

మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా చేతికి రిపోర్ట్

విచారణ కమిటీ సభ్యులు మంగళవారం సాయంత్రానికి తన రిపోర్టును సమర్పించనున్న నేపథ్యంలో నిషేధం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ప్రత్యర్థిని దెబ్బతీయాలనే కుట్ర చేయడమేకాక, అది సమిష్టి నిర్ణయమని చెప్పిన ఆసీస్‌ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌పై ఐసీసీ అరకొర చర్యలతో సరిపెట్టడాన్ని మాజీలు విమర్శించారు. కెప్టెన్ స్మిత్ ప్రోత్సాహాంతో టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్‌పై వేటు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్‌(ఎంసీసీ) సైతం ఘాటు వ్యాఖ్యలు

మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్‌(ఎంసీసీ) సైతం ఘాటు వ్యాఖ్యలు

అయితే, ఆటగాళ్లను శిక్షించడంలో ఐసీసీ చేయనిది సీఏ తప్పక చేస్తుందని ఆసీస్‌ మీడియా తన కథనంలో పేర్కొంది. క్రికెట్‌ నిబంధనలను రూపొందించే మెల్‌బోర్న్‌ క్రికెట్ క్లబ్‌(ఎంసీసీ) సైతం బాల్ టాంపరింగ్ ఘటనపై ఘాటుగానే స్పందించింది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్‌ గేమ్‌ పట్ల భవిష్యత్‌ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్‌ స్టీఫెన్‌సన్‌ అభిప్రాయపడ్డారు.

Story first published: Tuesday, March 27, 2018, 11:02 [IST]
Other articles published on Mar 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X