న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rajasthan Royals: ట్రెంట్ బోల్ట్ మీద క్రేజీ ప్రాంక్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు

Crazy prank on Trent Boult by Rajasthan royals players

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో రాజస్థాన్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి 14పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాకపోతే రాజస్థాన్ తన చివరి నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో ఓడిపోయింది. మిగిలిన రెండు గేమ్‌లలో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్‌ స్థానాన్ని పొందేందుకు చూస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తన తర్వాతి మ్యాచ్ కోసం రాజస్థాన్ ఎదురుచూస్తోంది. ఈ గేమ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు రియాన్ పరాగ్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ ఓ సరదా చేశారు. తమ టీం మేట్ అయిన పేసర్ ట్రెంట్ బౌల్ట్‌పై వారు ప్రాంక్ చేశారు.

రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా రిపోర్టర్ బౌల్ట్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు చెప్పి రిపోర్టర్‌తో సిల్లీ క్వశ్చన్లు అడిగించి బౌల్ట్‌ను విసిగించారు. బౌల్ట్ పాపం అన్ని క్వశ్చన్లకు నిజమైన ఇంటర్వ్యూ అనుకుని ఆన్సర్ ఇచ్చాడు. రిపోర్టర్ మా అమ్మ నేను అన్నం తింటున్నానో లేదో అని వర్రీ అవుతుంది.. నేను ఫుడ్ తింటున్నట్లు చెప్పు బోల్ట్ అంటూ బోల్ట్ ను అడగగా.. అతను ఇదేంటి అన్నట్లు ఫేస్ పెట్టాడు. అయినప్పటికీ చివరికి ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను ముందు ఇంటర్వ్యూ కానివ్వు అని బదులిచ్చాడు. ఎందుకు అంత భయపడి అన్సర్ ఇస్తున్నావ్ కాస్త నార్మల్ కూర్చుని ఆన్సర్స్ చెప్పు అనగా.. బోల్ట్ సరేనంటూ ఊ కొట్టాడు. ఇక రిపోర్టర్ ప్రశ్నలు అడుగుతుండగా.. లోపలి రూంలో పరాగ్, మిచెల్, నీషమ్ ఓ గదిలో నుంచి ఏం ప్రశ్నలు అడగాలో రిపోర్టర్ కు ఫోన్ ద్వారా చెప్పారు. ఇక చివరకు ఇంటర్వ్యలో పెద్ద క్వశ్చన్లేం అడగకుండానే అయిపోందని రిపోర్టర్ అనడంతో బోల్ట్ తెల్లమొహం వేశాడు. ఇక లోపలి గది నుంచి నీషమ్, మిచెల్, పరాగ్ వచ్చి మేం ప్రాంక్ చేయిచ్చాం అనేసరికి బోల్ట్ సైతం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా మీద స్టుపిడ్ గేమ్స్ ఆడతారా.. అయినా నేనేం వెర్రివాణ్ని కాలేదు అంటూ బోల్ట్ కూడా బదులిచ్చాడు. ఈ ప్రాంక్ వీడియోను ఆర్ఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.

బౌల్ట్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 8.33 ఎకానమీ రేటుతో 10 వికెట్లు తీశాడు. రాజస్థాన్ తన చివరి గేమ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్ఆర్ ఆరు వికెట్ల నష్టానికి 160పరుగులు మాత్రమే చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలోనే అంటే మరో 11 బంతులు మిగిలి ఉండగానే తమకు విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఇక రాజస్థాన్ ప్లేయర్లలో బట్లర్, యుజ్వేంద్ర చాహల్ ఈ సీజన్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా బట్లర్ కొనసాగుతుండగా.. పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ 23వికెట్లతో హసరంగా (23)తో సరిసమానంగా నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఆర్ఆర్ మరో విజయం సాధిస్తే నెట్ రన్ రేట్ వల్ల ప్లేఆఫ్ చేరే అవకాశాలుంటాయి.

Story first published: Saturday, May 14, 2022, 17:41 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X