న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరిన్ని పతకాలు పక్కా: తెలంగాణ బిడ్డ తడాఖా

Commonwealth Games 2022: here is Indias full schedule on Day 3 of the CWG in Birmingham

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కొనసాగుతోన్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లల్లో భారత్ రెండో రోజే పతకాల పంట పండించింది. కీలకమైన ఈవెంట్లల్లో దుమ్ము దులిపింది. తొలి రోజే అద్దిరిపోయేలా బోణీ కొట్టింది భారత్.. దాన్ని రెండోరోజు కొనసాగించింది. దూకుడును ప్రదర్శించింది. పతకాలతో అదరగొట్టింది. అదే జోరు ముడో రోజు కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని ఈవెంట్లల్లో పతకాలను అందుకేనే అవకాశాలు లేకపోలేదు.

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు వెయిట్ లిఫ్టర్ సాయిఖొమ్ మీరాబాయి చాను. శనివారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 201 కేజీల బరువును ఎత్తారు. అంతకుముందు ఇదే కేటగిరీలో భారత్‌కు రెండు పతకాలు అందాయి. వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గార్ వెండి పతకాన్ని ముద్దాడాడు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకున్నాడు.

పురుషుల 61 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజపుజారి రజతాన్ని గెలిచాడు. 269 కేజీల బరువును ఎత్తిన అతను మూడో స్థానంలో నిలిచాడు. ఇవ్వాళ మరిన్ని పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయమైనట్టే. మహిళా బాక్సర్, తెలంగాణ బిడ్డ, నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ ఇవ్వాళ రింగ్‌లో తన తడాఖా చూపబోతోన్నారు. 48-50 కేజీల లైట్ ఫ్లైవెయిట్‌లో కేటగిరీ నంబర్ 16లో ఆమె తలపడనున్నారు. ఈ సాయంత్రం 4:15 నిమిషాలకు ఈ బౌట్ ఉంటుంది.

హాకీలో భారత్ ఇవ్వాళ ఘనను ఢీ కొట్టబోతోంది. రాత్రి 8:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. జిమ్నాస్టిక్స్‌లో యోగేశ్వర్ సింగ్, బ్యాడ్మింటన్‌లో మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌ ఉంటుందివ్వాళ. మహిళా క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, లాన్ బౌల్ వంటి ఈవెంట్లల్లో భారత క్రీడాకారులు ఇవ్వాళ పోటీ పడనున్నారు. ఇందులో క్రికెట్ మ్యాచ్‌ను గెలిచే అవకాశం ఉంది. యోగేశ్వర్ సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లల్లో పతకాలు ఆశించవచ్చు.

Story first published: Sunday, July 31, 2022, 9:46 [IST]
Other articles published on Jul 31, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X