న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కాదని పాక్ కెప్టెన్‌కు ఓటేస్తావా మంజ్రేకర్..?: నెటిజన్ల మండిపాటు

హైదరాబాద్: భారత జట్టు మాజీ ఆటగాడు, క్రికెట్‌ వ్యాఖ్యత అయిన సంజయ్ మంజ్రేకర్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2017 గానూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ఆయన ఓటు వేస్తానని ప్రకటించడంతో అసలు వ్యవహారం మొదలైంది.

ఆరుగురిలో పాక్ కెప్టెన్ ది బెస్ట్:

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్‌ అవార్డులకు నామినీలుగా కొందరి పేర్లను ప్రకటించింది. ఇందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, అఫ్ఘనిస్థాన్‌ కెప్టెన్ అస్గర్లతో పాటు టీమిండియా మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్టు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్‌ తాను మాత్రం సర్ఫరాజ్‌ అహ్మద్‌కే ఓటేస్తానని చెప్పాడు.

జట్టులో సగం కష్టం అతనిదే:

‘కష్టకాలంలో సర్ఫరాజ్‌ కెప్టెన్సీ పాకిస్థాన్‌కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్‌ జట్టును కెప్టెన్‌గా విజయం దిశగా నడిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ టోర్నీని తన దేశానికి అందించి ఎక్కువ మ్యాచ్‌లను గెలిపించిన ట్రాక్‌ రికార్డు ఉంది. విదేశీ గడ్డలపై ఆడిన మొత్తం 13 వన్డే మ్యాచ్‌‌లలో 11 గెలిచి రెండింటిలో ఓడింది. పది టీ20మ్యాచ్‌లు ఆడి 8 గెలిచిం 2 ఓడింది. ఈ అన్ని మ్యాచ్‌లలోనూ మిగతా వారికంటే సర్ఫరాజ్‌ కష్టమే ఎక్కువ కనిపిస్తోంది.

మంజ్రేకర్‌పై అభిమానుల మండిపాటు:

అందుకే అండర్‌ డాగ్‌ జట్టయిన పాక్‌ సారథికే తన ఓటు వేస్తానంటూ సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లిని కాదని, దాయాది జట్టు కెప్టెన్‌ కు ఓటేయటంపై మంజ్రేకర్‌‌పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

పాక్ లోనూ వ్యతిరేకత:

పాక్ లోనూ వ్యతిరేకత:

‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్‌' కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర‍్ఫరాజ్‌ ఓవరాల్‌ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్‌.. మంజ్రేకర్‌ వేస్ట్‌ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్‌ అభిప్రాయంపై పాక్‌లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది.

 అతని తప్పేం లేదు:

అతని తప్పేం లేదు:

పాక్‌ను అండర్‌ డాగ్‌ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్‌లను చేజిక్కిచ్చుకున్న పాక్‌ను మంజ్రేకర్‌ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్‌ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Story first published: Tuesday, February 6, 2018, 11:55 [IST]
Other articles published on Feb 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X