న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్‌ను దాటేసిన మున్రో: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు

By Nageshwara Rao
Colin Munro becomes first batsman to score 3 centuries in T20I cricket

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరుగుతున్న టీ20 సిరిస్‌లో న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్, బ్రెండన్ మెక్‌కల్లమ్, ఎవిన్ లూయిస్, రోహిత్ శర్మలను దాటి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

బే ఓవల్ మైదానంలో వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో టీ20లో కోలిన్ మున్రో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. మొత్తంగా 196.2 స్ట్రయిక్ రేట్‌తో 53 బంతుల్లో 104 పరుగులు చేశాడు.

సోమవారం జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోలిన్ మున్రో, మూడో టీ20లో 53 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసిన పెవిలియన్‌కు చేరాడు. మున్రో విజృంభణతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.

Pandya Made Full Use Of His Opportunities - Dravid

ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ అయిన కోలిన్ మున్రో జనవరి 6, 2017న బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో మున్రో 54 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక, రెండో సెంచరీ భారత్‌పై సాధించాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు టీ20 సెంచరీలు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో మూడు సెంచరీలు చేసేందుకు గాను మున్రోకి 36 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా మున్రో చరిత్ర సృష్టించాడు.

మూడో టీ20లో మున్రో చేసిన సెంచరీ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్‌తో కలిసి ఐదో స్ధానంలో నిలబెట్టింది. అంతేకాదు మార్టిన్ గుప్టిల్‌తో కలిసి మున్రో నెలకొల్పిన 136 పరుగుల భాగస్వామ్యం టీ20 క్రికెట్‌లో టాప్-10 అత్యధిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. గుప్టిల్ 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 63 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, January 3, 2018, 15:15 [IST]
Other articles published on Jan 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X