న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఎంపికకు యో-యోనే ఎందుకు?: బోర్డుని ప్రశ్నించిన సీఓఏ

By Nageshwara Rao
CoA chief Vinod Rai to question BCCI over use of Yo-Yo test as parameter for national selection

హైదరాబాద్: విదేశీ పర్యటనలకు టీమిండియాను పంపించే ముందు ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ. ఈ ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితేనే తుది జట్టులో చోటు కల్పిస్తారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా ఆటగాళ్లకు బీసీసీఐ యో-యో టెస్టుని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ఈ యో-యో టెస్టుపై పలు విమర్శలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాలో చోటు కోసం యో-యో ఫిట్‌నెస్‌ టెస్టునే ప్రామాణికంగా ఎందుకు నిర్ణయించారో చెప్పాలని భారత క్రికెట్‌ బోర్డును పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ప్రశ్నించారు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడం తప్పు కాదు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడం తప్పు కాదు

జాతీయ జట్టులోకి తీసుకొనేందుకు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించడం తప్పు కాదని, అలాగని కేవలం ఇదొక్కటే అనుసరించడం ఏంటని ఆయన ప్రశ్నించినట్లుగా బీసీసీఐకి చెందిన అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌ ఐపీఎల్‌లో రాణించిన అంబటి రాయుడు, సంజూ శాంసన్‌ ఇద్దరూ యో-యో టెస్ట్‌లో విఫలమయ్యారు.

అంబటి రాయుడు అసంతృప్తి

అంబటి రాయుడు అసంతృప్తి

అంబటి రాయుడు ఐపీఎల్‌లో ఆత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా ఒకడిగా ఉన్నాడు. అలాంటి రాయుడు యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశం కోల్పోయాడు. దీంతో ఈ యో-యో టెస్టుపై బహిరంగంగానే రాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై

రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై

దీంతో యో-యో టెస్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. "వినోద్‌ రాయ్‌తోపాటు ఇతర పాలక సభ్యులకు రాయుడు, సంజూ శాంసన్‌కు జరిగిన విషయంపై పూర్తి అవగాహన ఉంది. యో-యో టెస్ట్‌పై వస్తున్న ఆరోపణలను రాయ్‌ బృందం పరిగణనలోకి తీసుకొంటుంది. దీనిపై జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సమాచారం అడిగే అవకాశం ఉంది" అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

యో-యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశం

యో-యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశం

"అయితే, యో-యో టెస్టు అనేది సాంకేతికతకు సంబంధించిన అంశమని, దీనిపై సీవోఏ చీఫ్‌ కలగజేసుకోరని, అయితే రాబోయే రోజుల్లో క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ సబా కరీమ్‌ నుంచి సంపూర్ణ సమాచారం తెలుసుకొంటారు. ఈ టెస్టు గురించి ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ఎన్‌సీఏ ట్రెయినర్లను ఆయన కోరే అవకాశం ఉంది" అని ఆయన తెలిపారు.

ఇదేమీ ఫుట్‌బాల్‌ కాదు

ఇదేమీ ఫుట్‌బాల్‌ కాదు

మరోవైపు భారత క్రికెట్‌లోకి ఎప్పటి నుంచి ఈ యో-యో టెస్టును అమల్లోకి తీసుకొచ్చిందీ లాంటి వివరాలను తెలియజేస్తూ బీసీసీఐ ట్రెజరరీ అనిరుధ్‌ చౌదరి ఆరు పేజీల లేఖను సీఓఏకు పంపించారు. ఇదిలా ఉంటే ఈ యో-యో టెస్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మాట్లాడుతూ "ఇదేమీ ఫుట్‌బాల్‌ కాదని, 90 నిమిషాల పాటు పరుగెత్తాల్సిన అవసరమేమీ ఉండదు. క్రికెట్‌లో ఒకటి, రెండు లేదా మూడు పరుగులు చేస్తూ ఉంటారు. అదీ మధ్యమధ్యలో విరామం తీసుకొంటూనే పరుగులు చేస్తారు. బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు యో-యో టెస్ట్‌ ఏమీ ఉపయోగపడదు" అని అన్నాడు.

Story first published: Monday, June 25, 2018, 13:33 [IST]
Other articles published on Jun 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X