న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

55 బంతుల్లో 88: క్రిస్‌లిన్ విధ్వంసం, ఈ సీజన్‌లో బ్రిస్బేన్ రెండో విజయం

 Chris Lynn stars as Brisbane Heat pick up second win

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో క్రిస్ లిన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న క్రిస్ లిన్ శుక్రవారం హోబార్ట్‌ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్ లిన్ వచ్చీ రావడంతోనే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ మ్యాక్స్‌ బ్రయాంట్‌(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు.

సిడ్నీ టెస్టులో లబుషేన్ డబుల్ సెంచరీ: అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియ‌న్‌గా రికార్డుసిడ్నీ టెస్టులో లబుషేన్ డబుల్ సెంచరీ: అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆస్ట్రేలియ‌న్‌గా రికార్డు

వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడటంతో పరుగుల వరద పారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాట్‌ రెన్‌షాతో కలిసి క్రిస్ లిన్ మెరుపులు మెరిపించాడు. రెన్‌ షా 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దీంతో బ్రిస్బేన్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. అంతకముందు సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

పాక్ ఆటగాళ్లకు పీసీబీ వార్నింగ్: ఫిట్‌గా లేకుంటే ఫీజులో 15 శాతం కోత!పాక్ ఆటగాళ్లకు పీసీబీ వార్నింగ్: ఫిట్‌గా లేకుంటే ఫీజులో 15 శాతం కోత!

తొలి మ్యాచ్‌లో కూడా క్రిస్ లిన్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, క్రిస్ లిన్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. డిసెంబర్‌లో జరిగిన వేలంలో అతడికి ముంబై ఇండియన్స్ కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Story first published: Saturday, January 4, 2020, 12:29 [IST]
Other articles published on Jan 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X