న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాతో మొదటి రెండు టీ20లకు క్రిస్ గేల్ దూరం!

India vs West Indies 2019 : Chris Gayle Will Not Play First Two T20s Against India | Oneindia Telugu
 Chris Gayle Will Not Play First Two T20s Against India Due To Global T20 League Participation

హైదరాబాద్: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. తొలి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

ఈ పర్యటన కోసం ఇప్పటికే వెస్టిండిస్ బోర్డు మొదటి రెండు టీ20ల కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. మొదటి రెండు టీ20లకు వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దూరమ్యయాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.

మొదటి రెండు టీ20లకు గేల్ దూరం

మొదటి రెండు టీ20లకు గేల్ దూరం

ఈ నేపథ్యంలో మొదటి రెండు టీ20లకు తాను అందుబాటులో ఉండనని క్రిస్ గేల్ ముందుగానే బోర్డుతో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు వెస్టిండిస్ బోర్డు ప్రకటించిన 14 మంది జట్టు సభ్యుల్లో సునీల్ నరేన్, కీరన్ పొలార్డ్‌లు చోటు దక్కించుకున్నారు. చివరగా సునీల్ నరేన్ విండిస్ తరుపున టీ20ల్లో సెప్టెంబర్, 2017న ఆడాడు.

రెండేళ్ల తర్వాత జట్టులోకి సునీల్ నరేన్

రెండేళ్ల తర్వాత జట్టులోకి సునీల్ నరేన్

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌కు సైతం సునీల్ నరేన్ ఎంపికవ్వలేదు. కాగా, ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున సునీల్ నరేన్ 10 వికెట్లతో ఫరవాలేదనిపించాడు. ఇక, పొలార్డ్ విషయానికి వస్తే గత రెండేళ్లుగా విండిస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేదు.

పొలార్డ్ మెరుపులు

పొలార్డ్ మెరుపులు

అయితే, టీ20ల్లో మాత్రం వెస్టిండిస్ తరుపున నిలకడగా ఆడుతున్నాడు. చివరిగా గతేడాది నవంబర్, 2018న వెస్టిండిస్ జట్టు తరుపున పొలార్డ్ టీ20 ఆడాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌లో వెస్టిండిస్ బోర్డు పలువురు యువ ఆటగాళ్లకు సైతం చోటు కల్పించింది.

యువ క్రికెటర్లకు చోటు

యువ క్రికెటర్లకు చోటు

వెస్టిండిస్ తరుపున 12 టీ20 మ్యాచ్‌లాడి... 46 లిస్ట్-ఏ గేమ్‌లు ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆంటోనీ బ్రామబోలే సైతం ఈ పర్యటనకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల ఆంటోనీ బ్రామబోలే వెస్టిండిస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడని ఆంటోనీ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గుయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Tuesday, July 30, 2019, 12:46 [IST]
Other articles published on Jul 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X