న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా 4 సిక్సులు: క్రిస్ గేల్ Vs రషీద్ ఖాన్ (వీడియో)

By Nageshwara Rao
Chris Gayle vs Rashid Khan - Gayle hit 4 consecutive sixes

హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ సెంచరీతో చెలరేగిన వేళ.... ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న రషీద్ ఖాన్ ఖాతాలో పలు చెత్త రికార్డులు చేరాయి. గురువారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ బౌలింగ్‌లో గేల్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదడంతో ఒకే ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఆరు సిక్స్‌లు కొట్టడంతో.. నాలుగో ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 55 పరుగులు ఇచ్చుకున్నాడు. టీ20ల్లో రషీద్‌ ఖాన్‌కు ఇదే చెత్త ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గేల్ ఆరు సిక్స్‌లు బాదగా.. గతంలో ఏబీ డివిలియర్స్ మాత్రమే రషీద్ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు బాదాడు.

అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్

అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్

2016 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆప్ఘాన్ స్పిన్నర్‌ను ఏబీ డివిలియర్స్ ఉతికారేశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్ అరుదైన రికార్డుని సృష్టించాడు. ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఈ ఘనత నమోదుకాగా.. ఈ సీజన్లో ఇది మూడోసారి.

 బ్రావో బౌలింగ్‌లో ఆండ్రూ రసెల్ ఆరు సిక్స్‌లు కొట్టగా

బ్రావో బౌలింగ్‌లో ఆండ్రూ రసెల్ ఆరు సిక్స్‌లు కొట్టగా

టోర్నీలో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బ్రావో బౌలింగ్‌లో ఆండ్రూ రసెల్ ఆరు సిక్స్‌లు కొట్టగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఆ మ్యాచ్‌లో షమీ బౌలింగ్ 9 బంతులు ఎదుర్కొన్న రసెల్ 40 పరుగులు సాధించాడు. 2016 ఐపీఎల్‌లో కరియప్ప బౌలింగ్‌లోనూ కోహ్లీ కూడా ఆరు సిక్స్‌లు బాదాడు.

15 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్

15 పరుగుల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్

కాగా, గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్‌ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సన్‌రైజర్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌ ఆటగాళ్లలో కేన్‌ విలియమ‍్సన్‌(54), మనీష్‌ పాండే(57 నాటౌట్‌), షకిబుల్‌ హసన్‌(24 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.

హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న తొలి బంతికి శిఖర్‌ ధావన్‌ గాయపడటంతో రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వృద్ధిమాన్‌ సాహా(6) తొలి వికెట్‌గా ఔట్‌ కావడంతో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన విలియమ‍్సన్‌-పాండే

76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన విలియమ‍్సన్‌-పాండే

ఆ తర్వాత యూసఫ్‌ పఠాన్‌(19) సైతం నిరాశపరిచాడు. ఆ తరుణంలో విలియమ‍్సన్‌-మనీష్‌ పాండే జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత విలియమ‍్సన్‌ ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ 193 పరుగులు నమోదు చేసింది.

Story first published: Friday, April 20, 2018, 8:28 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X