న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు గేల్‌ తాత్కాలిక విరామం.. భారత్‌తో సిరీస్‌కు దూరం!!

Chris Gayle Takes 'Break', Says No To India ODIs || Oneindia Telugu
Chris Gayle takes break, To Skip India ODIs

జొహన్నెస్‌బర్గ్‌: వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కొంత కాలం పాటు క్రికెట్ ఆట నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని గేల్‌ వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేశాడు. గేల్‌ తాజా నిర్ణయంతో వచ్చే నెలలో జరిగే భారత పర్యటనకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. భారత పర్యటనలో వెస్టిండీస్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.

బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం.. అనుజ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన ఆర్మీబాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం.. అనుజ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన ఆర్మీ

తాత్కాలిక విరామం:

తాత్కాలిక విరామం:

ఈ ఏడాది ఏ టోర్నీలో ఆడబోనని క్రిస్‌ గేల్‌ స్పష్టం చేశాడు. ఆ్రస్టేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లకు కూడా గేల్‌ దూరం కానున్నాడు. ప్రస్తుతానికి విరామం తీసుకోవడంపైనే తన ఆలోచనలు సాగుతున్నాయని గేల్ చెప్పాడు. ఈ సంవత్సరం పూర్తిగా విరామం తీసుకుని వచ్చే సంవత్సరం కెరీర్‌ కొనసాగించే విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటానని గేల్ వెల్లడించాడు.

లక్ష్యం టీ20 ప్రపంచకప్‌:

లక్ష్యం టీ20 ప్రపంచకప్‌:

40 ఏళ్ల గేల్‌ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గేల్‌ ఆదివారం తన చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ లీగ్‌లో జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచులు ఆడగా.. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ లీగ్‌కి వీడ్కోలు పలుకుతున్నట్లు గేల్ ప్రకటించాడు.

జట్టుకి భారంగా కనిపిస్తాను:

జట్టుకి భారంగా కనిపిస్తాను:

క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను అభిమానులతో పంచుకున్నాడు. 'తాను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తాను. జట్టులోని సభ్యులు తనను భారంగా భావిస్తున్నారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫ్రాంఛైజీ తరపున క్రికెట్ ఆడుతున్నా. అప్పటి నుంచి పరిశీలించిన తర్వాతే నాకు ఈ విషయం అర్ధం అయింది' అని గేల్ అన్నాడు.

కనీస మర్యాద దక్కడం లేదు:

కనీస మర్యాద దక్కడం లేదు:

'జట్టులో కనీస మర్యాద కూడా దక్కడం లేదు. నేను గతంలో ఏమి చేశానో వాళ్లకు గుర్తుంచుకోవడం లేదు. అయితే నేను ఫ్రాంఛైజీ గురించి మాట్లాడటం లేదు, జనాలు ఏమనుకుంటున్నారో మాత్రమే చెబుతున్నా. ఒక్కసారి గేల్ విఫలం అయితే.. ఇక అతని కెరిర్ ముగిసిపోయినట్లే, అతను మంచి ప్లేయర్ కాదు లాంటి లాంటి కామెంట్స్ నాపై వస్తున్నాయి. అయితే వీటికి అలవాటు పడటం నేర్చుకున్నా' అని గేల్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, November 27, 2019, 13:20 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X