న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: గేల్‌ను బెంగళూరు అనవసరంగా వదులుకుందా?

By Nageshwara Rao
Chris Gayle says nothing to prove after IPL ton

హైదరాబాద్: టీ20ల్లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎవరంటే అభిమానుల నోటి వెంట ఠక్కున వచ్చే సమాధానం క్రిస్ గేల్. టీ20ల్లో పదివేలకుపైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్. 38 ఏళ్ల వయసులో కూడా తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించాడు.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి మొహాలీ వేదికగా పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ చూసి ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలన్నీ తెగ బాధపడి ఉంటాయి. ఎందుకంటే జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో గేల్‌ను ఎవరూ పట్టించుకోలేదు.

ఐపీఎల్‌తోపాటు టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు అతని పేరు మీద ఉన్నా.. ఫ్రాంచైజీలు మాత్రం అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. గేల్ వయసును చూసి వాళ్లు వెనకడుగు వేసుంటారు. అయితే, ఇప్పుడు అవే ప్రాంఛైజీలు గేల్‌ను అనవసరంగా మిస్ చేసుకున్నామా? అని బాధపడుతున్నాయి.

ఆటకు వయసుతో సంబంధం లేదు

ఆటకు వయసుతో సంబంధం లేదు

అయితే ఆటకు వయసుతో సంబంధం లేదని గేల్ మరోసారి నిరూపించాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ (63 బంతుల్లో 104 నాటౌట్) చెలరేగడంతో.. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. టీ20ల్లో గేల్‌కు ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్ వేలంలో చివరి నిమిషంలో గేల్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ తెగ మురిసిపోతోంది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న గేల్

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న గేల్

ఈ మ్యాచ్‌లో సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్రిస్ గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ 'చాలా మంది నేను ముసలివాడినైపోయానని అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సెంచరీ నా కూతురికి అంకితం. శుక్రవారం ఆమె బర్త్‌డే. నేను కింగ్స్ పంజాబ్ జట్టులో చేరినప్పటి నుంచీ సెహ్వాగ్ నాకు ఒకటే చెబుతున్నాడు. యోగా, మసాజ్ చేసే వ్యక్తులతోనే ఎక్కువగా గడపమని. నా సక్సెస్‌కు అదే కారణం అనుకుంటా' అని నవ్వుతూ చెప్పాడు.

 నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు

నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు

'నేను ఏ జట్టు తరఫున ఆడినా వంద శాతం నా మెరుగైన ప్రదర్శన చేయాలనే అనుకుంటాను. ఈ ఏడాది కొత్త ఫ్రాంఛైజీకి ఆడుతున్నాను. జనవరిలో నిర్వహించిన వేలంలో మొదట నన్ను ఎవరూ తీసుకోలేదు. కానీ, చివర్లో సెహ్వాగ్‌ మెంటార్‌గా ఉన్న కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ నన్ను తీసుకుంది. దీంతో చాలా మంది ఈ సీజన్‌లో నేనేంటో రుజువు చేసుకోవాలని అన్నారు.ఐపీఎల్‌లో నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు. నన్ను ఎంచుకొని సెహ్వాగ్ ఐపీఎల్‌ను కాపాడాడు. గేల్ రెండు మ్యాచ్‌లు గెలిపించినా మేం పెట్టిన డబ్బుకు న్యాయం చేసినట్లే అని ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పాడు. దీనిపై అతనితో మాట్లాడాలని అనుకుంటున్నా. నేను ఎవరికో ఏదో నిరూపించాలని ఇక్కడికి రాలేదు. నా క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా' అని గేల్ చెప్పుకొచ్చాడు.

మొహాలీలో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌కి ఇదే తొలి విజయం

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ ఇప్పటివరకు 19 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆటగాళ్ల గేల్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 178/4కే పరిమితమైంది. దీంతో సన్‌రైజర్స్‌పై పంజాబ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొహాలీలో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

Story first published: Friday, April 20, 2018, 13:26 [IST]
Other articles published on Apr 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X