న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్‌ టెస్టు కెరీర్ ముగిసి పోలేదు: తొలిసారి నోరు విప్పిన ఎమ్మెస్కే ప్రసాద్‌

Chief selector MSK Prasad reveals whether Shikhar Dhawans Test career is over

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలో సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలతో పాటు కరుణ్‌ నాయర్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

<strong>అర్థం చేసుకోలేకపోతున్నా: జట్టు ఎంపికపై ప్రశ్నల వర్షం కురిపించిన భజ్జీ </strong>అర్థం చేసుకోలేకపోతున్నా: జట్టు ఎంపికపై ప్రశ్నల వర్షం కురిపించిన భజ్జీ

యూఏఈ వేదికగా ముగిసిన ఆసియాకప్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు భారత్‌కు ఏడోసారి ట్రోఫీని అందించడంలో కీలకంగా వ్యవహారించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వీరిద్దరిని ఎంపిక చేయకపోవడంపై అటు‌ అభిమానులతో పాటు, ఇటు సీనియర్‌ క్రికెటర్లు సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధావన్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు

ధావన్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు

ఆసియాకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ధావన్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియాకప్‌లో రాణించినప్పటికీ, ఇంగ్లీషు గడ్డపై ఓపెనర్‌గా ధావన్ ఆశించినమేరకు రాణించలేదు. దీనిని కారణంగా చూపుతూ ధావన్‌ను విండిస్‌తో జరగబోయే టెస్టు సిరిస్‌కు ఎంపిక చేయలేదు.

ధావన్‌ కెరీర్‌ ముగిసిపోయిందంటూ వార్తలు

ధావన్‌ కెరీర్‌ ముగిసిపోయిందంటూ వార్తలు

దీంతో, ధావన్ తన కెరీర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్‌ని ఆడేశాడని, ధావన్‌ కెరీర్‌ ముగిసిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక అనంతరం మొదటిసారి టీమిండియా ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఆసియాకప్‌లో రాణించడం ఆశ్చర్యంగా అనిపించింది

ఆసియాకప్‌లో రాణించడం ఆశ్చర్యంగా అనిపించింది

"ఇంగ్లాండ్‌ పర్యటనలో ధావన్‌ విఫలమైనప్పటికీ ఆసియాకప్‌లో రాణించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ధావన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. విండిస్ ఎంపిక కాకపోతే ఇక ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా టెస్టులకూ ధావన్‌ ఎంపిక కాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజం కావు" అని చెప్పుకొచ్చాడు.

కఠిన నిర్ణయాల వల్ల ధావన్‌ను ఎంపిక చేయలేదు

కఠిన నిర్ణయాల వల్ల ధావన్‌ను ఎంపిక చేయలేదు

"విండిస్‌తో జరగబోయే టెస్టు సిరిస్‌లో తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధావన్‌ను ఎంపిక చేయలేదు. అలాగని అతడి టెస్ట్‌ కెరీర్‌ ముగిసిపోయినట్లు కాదు. ధావన్‌ కోసం తలుపులు తెరిచే ఉంటాయి" అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. చివరిగా 2016/17 సీజన్‌లో కూడా ధావన్ విషయంలో సరిగ్గా ఇలానే జరిగింది.

2016లో కూడా ఇలానే

2016లో కూడా ఇలానే

2016లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్ జట్టులో చోటు కోల్పోయాడు. గాయం కారణంగా కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు దూరం కావడంతో ధావన్ మళ్లీ తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది పాటు ధావన్ సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరమయ్యాడు.

Story first published: Tuesday, October 2, 2018, 16:49 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X