న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కు పంత్‌ని తప్పించడంపై చీఫ్ సెలక్టర్ ఇలా!

India vs Australia ODI Series : Pant definitely Be Part Of 2019 World Cup : MSK Prasad
Chief selector MSK Prasad explains reason behind Rishabh Pants absence from ODI squad vs Australia

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ కోసం వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

<strong>ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు పాక్ ప్రధాని శుభాకాంక్షలు</strong>ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేనకు పాక్ ప్రధాని శుభాకాంక్షలు

ఈ వన్డే సిరిస్‌కు ఇటీవలే జట్టుని ప్రకటించిన సెలక్టర్లు వికెట్ కీపర్‌గా ధోనీకి చోటు కల్పించారు. దీంతో ఈ ఏడాది ప్రపంచకప్ వరకూ కీపర్‌గా ధోనీనే కొనసాగుతాడని.. అప్పటి వరకూ వన్డేల్లో స్థానం కోసం పంత్ నిరీక్షించాల్సిందేనంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వన్డే జట్టు నుంచి పంత్‌ని తప్పించడానికి గల కారణాలను ఎమ్మెస్కే మీడియాతో వెల్లడించాడు.

రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్‌గా

రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్‌గా

"టీమిండియా వరల్డ్‌కప్ ప్రణాళికల్లో రిషబ్ పంత్ కూడా ఒక వికెట్ కీపర్‌గా ఉన్నాడు. రేసులో ఉన్న ముగ్గురు వికెట్ కీపర్లు (ధోనీ, పంత్, దినేశ్ కార్తీక్) ఇటీవల అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో టీ20, టెస్టు సిరీస్‌‌ల్లో ఆడిన పంత్‌కి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తప్పించాం. పంత్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లందరి పని ఒత్తిడిపైనా దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటున్నాం" అని చెప్పుకొచ్చాడు.

బుమ్రాకు విశ్రాంతి, సిరాజ్‌కు చోటు

బుమ్రాకు విశ్రాంతి, సిరాజ్‌కు చోటు

ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రాని తప్పించిన సెలక్టర్లు.. అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరిస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది.

పని ఒత్తిడి తగ్గించి తగినంత విశ్రాంతి ఇవ్వాలనే

పని ఒత్తిడి తగ్గించి తగినంత విశ్రాంతి ఇవ్వాలనే

ఈ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పని ఒత్తిడి తగ్గించి తగినంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆసీస్‌తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సెంచరీతో పాటు 350 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత్ జట్టు:

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తలపడే భారత్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Story first published: Tuesday, January 8, 2019, 15:38 [IST]
Other articles published on Jan 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X