న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక సిరీస్‌కు పాక్ జట్టు ఎంపిక: ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం.. హరియాణా అల్లుడు దూరం

Chief selector Misbah ul Haq names 16-member ODI squad for Sri lanka series, Abid Ali, Usman Shinwari and Ifthikar Ahmed recalled

కరాచీ: త్వరలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ప్రకటించింది. పాకిస్తాన్‌ హెడ్ కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ జట్టులో పలు మార్పులు చేసింది. ఈ సిరీస్ కోసం మిస్బా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. పాక్‌ జట్టులోకి ఐదుగురు కొత్త వాళ్లకి అవకాశం కల్పించాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోని హరియాణా అల్లుడు హసన్‌ అలీకి జట్టులో చోటు ఇవ్వలేదు.

India vs South Africa 3rd T20I: మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగే అవకాశం 50-50India vs South Africa 3rd T20I: మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగే అవకాశం 50-50

సర్ఫరాజ్‌ అహ్మద్‌కే పగ్గాలు:

సర్ఫరాజ్‌ అహ్మద్‌కే పగ్గాలు:

హరియాణా యువతితో హసన్‌ అలీ వివాహం గత నెలలో జరిగిన విషయం తెలిసిందే. హసన్‌ గాయం తీవ్రతపై స్పష్టత లేదని, అందుకే అతడికి విశ్రాంతిని ఇచ్చామని మిస్బా తెలిపాడు. అలీతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్‌ హఫీజ్‌లను కూడా పక్కకు పెట్టాడు. అయితే పేలవ ఫామ్‌లో ఉన్న స్టార్ పేసర్ మహ్మద్‌ అమిర్‌ను ఎంపిక చేశారు. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌పై నమ్మకం ఉంచి అతన్నే కొనసాగించారు. ఇక వైస్‌ కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌ ఉన్నాడు.

బలహీన ప్రత్యర్థులు ఉండరు:

బలహీన ప్రత్యర్థులు ఉండరు:

'మ్యాచ్ గెలవడానికి బలహీన ప్రత్యర్థులు ఉండరు. లంక జట్టు నుండి అనుభవం లేని ఆటగాళ్లు వచ్చినా.. సీనియర్‌ క్రికెటర్లు వచ్చినా మేము బలమైన జట్టును ఎంపిక చేయాలని భావించాం. జట్టులో ఐదుగురు కొత్త వాళ్లను ఎంపిక చేశాం. ఇందులో నలుగురు ఆటగాళ్లు ప్రపంచకప్‌కు ఆడాల్సిన వాళ్లే.. కానీ వారికి అవకాశం దక్కలేదు. సర్ఫరాజ్‌ అహ్మద్‌పై నమ్మకం నమ్మకం ఉంది. అతడు జట్టును నడిపించగలడు. అన్ని విభాగాల్లో పాక్‌ బలంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే పాక్‌దే విజయం' అని మిస్బా తెలిపాడు.

బిర్యానీ బంద్:

బిర్యానీ బంద్:

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శన చేయడంతో మిస్బా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే పాక్ ఆటగాళ్లు బిర్యానీ, స్పైసీ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలని ఇప్పటికే మిస్బా ఆదేశాలు జారీ చేశాడు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. శ్రీలంకతో ఈ నెల 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. మొదటి వన్డే సెప్టెంబర్ 27న జరుగుతుంది. ఈ సిరీస్ కోసం లంక జట్టులోని 10 మంది ఆటగాళ్లు నిరాకరించిన విషయం తెలిసిందే.

జట్టు:

జట్టు:

సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), బాబర్‌ అజమ్‌(వైస్‌ కెప్టెన్‌), అబిద్‌ అలీ, ఆసిఫ్‌ ఆలీ, పఖర్‌ జామన్‌, హారీస్‌ సోహైల్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌, ఇమాద్‌ వసీమ్‌, ఇమాముల్‌ హక్‌, అమిర్‌, మహమ్మద్‌ హస్నైన్‌, నవాజ్‌, రియాజ్‌, షాదాబా ఖాన్‌, ఉస్మాన్‌ షిన్వారీ, వాహబ్‌ రియాజ్‌.

Story first published: Sunday, September 22, 2019, 13:03 [IST]
Other articles published on Sep 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X