న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎలైట్ జాబితాలోకి పుజారా: టెస్టుల్లో అరుదైన రికార్డు

By Nageshwara Rao
Cheteswar Pujara bats on all five days, enters elite club

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టులో ఐదు రోజులపాటు బ్యాటింగ్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

కొల్‌కతా టెస్టులో ఐదు రోజులపాటు పుజారా క్రీజులో నిలిచాడు. తద్వారా భారత్‌ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు అయ్యాడు. అంతకు ముందు జయసింహా, రవిశాస్త్రి ఇలా ఐదు రోజులపాటు బ్యాటింగ్‌ చేశారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన 9వ ఆటగాడిగా పుజారా రికార్డు సృష్టించాడు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చివరి ఆటగాడిగా బరిలోకి దిగిన హైదరాబాద్ ప్లేయర్ ఎంఎల్ జయసింహా టీమిండియాను ఆదుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు.

ఈ మ్యాచ్‌లో జయసింహా 74 బంతులను ఎదుర్కొని 20 నాటౌట్‌గా నిలిచాడు. ఇక రవిశాస్త్రి 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు రోజులపాటు ఆడాడు. ఈ మ్యాచ్‌లో రవిశాస్త్రి 111 బంతులను ఎదుర్కొని 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ముగ్గురూ ఈడెన్‌ గార్డెన్స్‌లోనే ఈ ఘనత సాధించారు. ఈ ఘనత సాధించిన అంతర్జాతీయ అటగాళ్ల జాబితాలో జే బాయ్‌కాట్‌(ఇంగ్లాండ్‌), కేజే హ్యూస్‌ (ఆస్ట్రేలియా), అలన్‌ లాంబ్‌ (ఇంగ్లాండ్‌), ఏఎఫ్‌జీ గ్రిఫ్ఫిత్‌ (వెస్టిండీస్‌‌‌), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (ఇంగ్లాడ్‌), ఏఎన్‌ పీటర్సన్‌ (సౌతాఫ్రికా)లు ఉన్నారు.

ఐదు రోజుల పాటు క్రీజులో ఉన్న ఆటగాళ్ల జాబితా:


ML Jaisimha (India)


Geoffrey Boycott (England)


Kim Hughes (Australia)


Allan Lamb (England)


Ravi Shastri (India)


Adrian Griffith (West Indies)


Andrew Flintoff (England)


Cheteshwar Pujara (India)


తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 10:54 [IST]
Other articles published on Nov 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X