న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దంచికొట్టిన చతేశ్వర్ పుజారా.. ఒకే ఓవర్లో 22 పరుగులు.. 73 బంతుల్లోనే సెంచరీ!

 Cheteshwar Pujara Smashes 22 Runs In Single Over In Royal London One-Day Cup

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా దుమ్మురేపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్‌లో సస్సెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వార్విక్‌షైర్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పుజారా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. సాధారణంగా నిదానంగా ఆడే పుజారా.. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఒక్కోసారి బౌలర్లను విసగిస్తూ వారి సహనానికి పరీక్షగా నిలుస్తాడు. 50 బంతులు ఆడి ఒక్క పరుగు చేయని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

అలాంటి పుజారా ఉగ్రరూపం కనబర్చాడు. 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో సస్సెక్స్ 311 పరుగుల లక్ష్య ఛేదనలో 112 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పుజారా 22వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.


ఇక యామ్ నార్వెల్ వేసిన 45వ ఓవర్‌లో పుజారా చెలరేగిపోయాడు. అప్పటికే 59 బంతుల్లో 66 పరుగులతో క్రీజ్‌లో ఉన్న అతడు.. ఆ ఓవర్లో వరుసగా 4,2,4,2,6,4 బాదాడు. దీంతో 88 పరుగులకు చేరుకొన్నాడు. ప్రస్తుతం పుజారా దూకుడు బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో తన సెంచరీ సాధించాడు. 49వ ఓవర్లో హన్నాన్-డాల్బీ చేతిలో క్లీన్ బౌల్డ్ కావడంతో అతడి పోరాటం ముగిసింది. ఆ తర్వతా సస్సెక్స్ బ్యాటర్లను బౌలర్లు కట్టడిచేయడంతో నాలుగు పరుగుల తేడాతో వార్విక్‌షైర్‌ విజయం సాధించింది. సస్సెక్స్ రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైన్స్ గాయం కారణంగా దూరమవ్వడంతో ఈ మ్యాచ్‌లో పుజారానే కెప్టెన్సీ చేశాడు.

ఎప్పుడూ నిదానంగా ఆడే పుజారా ఇలా ధాటిగా ఆడటం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరం క్రికెట్‌లో దూకుడుగా ఆడకుంటే మనుగడ లేదనే విషయాన్ని పుజారా గ్రహించే తన ఆటను అప్ డేట్ చేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, August 13, 2022, 15:19 [IST]
Other articles published on Aug 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X