క్యారెక్టర్ ఫస్ట్, స్కిల్ సెకండ్: పరువు తీసిన ఆసీస్ జట్టుకు హస్సీ సూచన

Posted By:
‘Character first, skill second’: Mike Hussey calls for Australian team to reassess priorities

హైదరాబాద్: 'క్యారెక్టర్ ఫస్ట్, స్కిల్ సెకండ్' ఈ మాట అన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యల అనంతరం ప్రస్తుతం చెన్నైలో ఉన్న మైక్ హస్సీ మీడియాతో మాట్లాడాడు.

బాధపడ్డాం.. కోపంగా కూడా ఉన్నాం: బాల్ టాంపరింగ్ వివాదంపై వార్న్

'బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తిరిగి పూర్వవైభవం పొందడమనేది కష్టమైన అంశం. కానీ జట్టుకు మాత్రం కోల్పోయిన విలువలను తిరిగి పొందడానికి ఇదో అవకాశం. కొన్ని సంవత్సరాలుగా ఆటలో విలువలు దిగజారిపోతున్నాయని నేను భావిస్తున్నాను. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో చాలామంది గొప్ప ఆటగాళ్లున్నారు' అని అన్నాడు.

'కొంతమంది నిర్ణయం మూలంగా జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా బాల్‌ టాంపరింగ్‌తో సంబంధం ఉన్నట్లు వార్తల్లో నిలవాల్సి వచ్చింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తీసుకున్న కఠిన నిర్ణయంతో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరోవైపు ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలల వరకూ ఈ నిషేధం ఎదుర్కొనున్నాడు' అని తెలిపాడు.

వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కాలేడు: ఎందుకంటే!

'ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ కొంతకాలం గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే, ఆస్ట్రేలియా జట్టులో మార్పునకు ఇదే సరైన సమయం. మన విలువలు, జట్టు సంస్కృతి.. వంటి వాటిలో మార్పులు రావాలి. మేము ఎంతో కష్టపడి ఆడాం. పూర్తి స్థాయిలో కచ్చితంగా సానుకూలంగా, నిజాయతీతో ఆడాం. వాటిని తిరిగి జట్టు పొందాలి' అని హస్సీ సూచించాడు.

'బాల్ టాంపరింగ్ వివాదం నుంచి సాధ్యమైనంత తక్కువ కాలంలోనే ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ బయటపడుతుందని ఆశిస్తున్నా. ఈ బాల్‌ టాంపరింగ్‌ వివాదంపై కొంతకాలం చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ అభిమానులు వారికి మరో అవకాశం ఇస్తే కానీ, ఆటగాళ్లు తమని తాము నిరూపించుకోగలరు' అని హస్సీ పేర్కొనాడు.

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌‌లపై ఏడాది నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఐపీఎల్ 11వ సీజన్‌లో మైక్ హస్సీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా, కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్లపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 8:03 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి