న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్పు అవసరం: టీమిండియా హెడ్ కోచ్ రేసులో రాబిన్ సింగ్!

Change could be good: Robin Singh targets India head coach job

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న భారత జట్టులో మార్పులు అవసరమని టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాను నడిపించే సత్తా తనకుందని, తన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని రాబిన్ సింగ్ చెప్పుకొచ్చాడు. గత 15 ఏళ్లుగా రాబిన్ సింగ్ అనేక జట్లకు కోచ్‌గా వ్యవహారించారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

దీంతో బీసీసీఐ ఆహ్వానం మేరకు తాజాగా టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాబిన్ సింగ్ మాట్లాడుతూ "ప్రస్తుత కోచ్‌ పర్యవేక్షణలో భారత్‌ రెండు వరుస ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌ల్లో కూడా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు 2023 ప్రపంచకప్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నాడు.

జట్టులో మార్పులు అవసరం

జట్టులో మార్పులు అవసరం

"జట్టులో మార్పులు కూడా అవసరమే. జట్టు కఠినసమయాల్లో ఉన్నప్పుడు కోచ్‌ పాత్ర కీలకం. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆటగాళ్లతో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. అది ఆటను సాంకేతికంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతోంది" అని రాబిన్‌ సింగ్‌ అన్నాడు.

కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినంటే

కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినంటే

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తాను కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినో కూడా రాబిన్ సింగ్ వివరించాడు. "బంతి స్వింగ్‌ అవ్వడంతో రోహిత్‌ శర్మ త్వరగా ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లీని పంపించకుండా మరో టాపర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ఆడించేవాడిని" అని అన్నాడు.

నాలుగో స్థానంలో కోహ్లీని పంపించి

నాలుగో స్థానంలో కోహ్లీని పంపించి

"ఇక, నాలుగో స్థానంలో కోహ్లీని పంపించి ఐదో స్థానంలో ధోనిని ఆడించేవాడిని. అప్పుడు కోహ్లీ-ధోని మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారు. చివర్లో హార్ధిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు పవర్‌ హిట్టింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించేవారు" అని తన వ్యూహాన్ని రాబిన్‌ సింగ్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే, రాబిన్ సింగ్ భారత్‌ తరఫున 136 వన్డేలు, ఒక్క టెస్ట్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా

2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా

అంతేకాదు 2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా కూడా పని చేసాడు. భారత అండర్‌-19, ఏ జట్లకు సైతం కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు సహాయ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇదిలా ఉంటే, కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం రవిశాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి బాగా పనిచేశాడు

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి బాగా పనిచేశాడు

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి బాగా పనిచేశాడు

తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి బాగా పని చేశాడని అన్షుమన్ గైక్వాడ్ ప్రశసంల వర్షం కురిపించడంతో అతడికే మరోసారి కోచ్‌ పగ్గాలు అప్పగించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Sunday, July 28, 2019, 10:36 [IST]
Other articles published on Jul 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X