న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డ్రాగా ముగిసిన శ్రీలంక-వెస్టిండిస్‌ వివాదాస్పద రెండో టెస్టు

By Nageshwara Rao
Chandimal Sweats as Sri Lanka & Windies Draw Controversial 2nd Test

హైదరాబాద్: కరేబియన్ గడ్డపై సెయింట్ సెయింట్ లుసికాలో ఉన్న డారెన్ సామి స్టేడియంలో శ్రీలంక-వెస్టిండిస్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను ఆఖరి రోజైన సోమవారం శ్రీలంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు.

ఈ క్రమంలో విండిస్ ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (59 నాటౌట్‌; 172 బంతుల్లో 6 ఫోర్లు), హోప్‌ (39; 115 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది. రెండో ఇన్నింగ్స్‌‌లో వెస్టిండిస్ ఐదు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓటమి అంచుల్లోకి వెళ్లింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రాత్‌వైట్‌ బాధ్యతాయుతంగా ఆడి ఓటమి నుంచి తప్పించాడు. అయితే చివరి సెషన్‌లో వాతావరణం అనుకూలించక పోవటంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. మ్యాచ్‌ ముగిసే సయయానికి వెస్టిండీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులతో ఉంది.

1
43247

దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తా చాటిన విండీస్‌ బౌలర్‌ గాబ్రియేల్‌ (13/121)కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరిస్‌లో వెస్టిండీస్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరిస్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండిస్ 226 పరుగలు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఈ టెస్టులో శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌పై ఐసీసీ బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విండిస్‌తో జరిగిన ఈ టెస్టులో చండీమాల్‌ ఉద్దేశ్యపూర్వకంగానే బంతి ఆకారాన్ని దెబ్బ తీసినట్లు ఐసిసి పేర్కొన్న సంగతి తెలిసిందే.

మ్యాచ్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్‌:
శ్రీలంక: 253 ఆలౌట్‌
వెస్టిండీస్‌: 300 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్:
శ్రీలంక: 342 ఆలౌట్‌
వెస్టిండిస్: 147/5

Story first published: Tuesday, June 19, 2018, 12:30 [IST]
Other articles published on Jun 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X