చాహల్ మళ్లీ నోబాల్...? మిల్లర్ స్కోరు బోర్డునే చూస్తూ...

Posted By: Subhan

హైదరాబాద్: సఫారీ జట్టుపై చాహల్ మరోసారి మాయాజాలాన్ని ప్రదర్శించి సక్సెస్ అయ్యాడు. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చాహాల్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో డేవిడ్‌ మిల్లర్‌ మరోసారి విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో మిల్లర్‌ విషయంలో పొరపాట్లు చేసిన చాహల్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా అతన్ని బోల్తా కొట్టించాడు.

 స్కోరు బోర్డున చూసుకుంటూ:

స్కోరు బోర్డున చూసుకుంటూ:

చాహల్‌ బంతిని కొట్టేందుకు మిల్లర్‌ ముందుకొచ్చాడు. ఊహించని రీతిలో బంతి గింగిరాలు తిరుగుతూ లెగ్‌ స్టంప్‌ను ఢీకొట్టింది. అయినా వెంటనే పెవిలియన్‌ వెళ్లేందుకు మిల్లర్‌ తటపటాయించాడు. నాలుగో వన్డేలో జరిగినట్లు మళ్లీ ఏదైనా లక్కు కలిసొస్తుందేమోనన్న ఆశతో.. సంశయంగా పదేపదే స్కోరు బోర్డును చూస్తూ అతను పెవిలియన్‌ బాట పట్టాడు.

 లైఫ్ అందుకుని చెలరేగిపోయాడు:

లైఫ్ అందుకుని చెలరేగిపోయాడు:

నాలుగో వన్డేలో మిల్లర్‌కు అనూహ్యంగా లైఫ్‌ దొరికింది. చాహల్‌ వేసిన బంతిని మిల్లర్‌ అంచనా వేయడంలో ఇలాగే విఫలయ్యాడు. ఏడు పరుగుల వద్ద అతను బౌల్డ్‌ అయ్యాడు. అయితే, చాహల్‌ నిర్లక్ష్యం కారణంగా అది నోబాల్‌ కావడంతో మిల్లర్‌కు లైఫ్‌ దొరికింది. టీమిండియా ఓటమికి గురవడానికి అదీ ఓ కారణం అయింది. ఇలా లైఫ్‌ అందుకున్న మిల్లర్‌ చెలరేగి ఆడాడు.

 గంగూలీ, గవాస్కర్ లు మండిపడ్డారు:

గంగూలీ, గవాస్కర్ లు మండిపడ్డారు:

మ్యాచ్‌ కీలక దశలో నోబాల్‌ వేసి.. వికెట్‌ అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకున్న చాహల్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌరవ్‌ గంగూలీ, సునీల్‌ గవాస్కర్‌ అతని తీరుపై మండిపడ్డారు. చాహల్ అలా చేసుండకూడదంటూ తప్పుబట్టారు.

 చాహల్ 2, కుల్‌దీప్ 4:

చాహల్ 2, కుల్‌దీప్ 4:

నాలుగో వన్డే తర్వాత చాహల్ బౌలింగ్‌లో మార్పును చూపించాడు. ఐదో వన్డేలో చాలా బుద్ధిగా బౌలింగ్‌ చేశాడు. తప్పులకు తావివ్వలేదు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కుల్దీప్‌ చాహల్‌ (రెండు వికెట్లు), యాదవ్‌ (4 వికెట్లు) తీసి అద్భుతంగా రాణించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 12:45 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి