న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో వింత ఘటన: అందుకు కారణం ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్

By Nageshwara Rao
Caribbean Premier League 2018 cricket scores, Steve Smith hits wicket in CPL

హైదరాబాద్: క్రికెట్‌లో విచిత్రమైన ఘటన. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒకే బంతికి రెండు సార్లు ఔటయ్యాడు. ఈ ఔట్ అంఫైర్‌నే తికమక పెట్టింది. ఈ విచిత్రమైన ఘటన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చోటుచేసుకుంది. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ ప్రస్తుతం లీగ్ క్రికెట్‌లో ఆడుతున్నాడు.

ఇందులో భాగంగా కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్‌ ట్రెడెంట్స్‌ జట్టుకు స్టీవ్ స్మిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా గురువారం జమైకా తల్లావాస్‌-బార్బడోస్‌ ట్రెడెంట్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ విచిత్రంగా ఔటై అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

మరో రెండు బంతుల్లో బార్బడోస్‌ ట్రెడెంట్స్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందనగా వెస్టిండిస్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్‌ బౌలింగ్‌లో స్మిత్‌ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న పావెల్ సునాయాసంగా ఆ క్యాచ్‌ అందుకున్నాడు. ఇంతలోనే స్మిత్‌ బ్యాట్‌ వికెట్లను తాకడంతో హిట్‌ వికెట్‌ కూడా అయ్యాడు.

Caribbean Premier League 2018 cricket scores, Steve Smith hits wicket in CPL

దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తికమకపడి చివరికి క్యాచ్‌‌నే ఔట్‌గా ప్రకటించాడు. టీవీ కామెంటేటర్లు సైతం స్మిత్‌ రెండు విధాలుగా ఔటయ్యాడంటూ నవ్వుకున్నారు. ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై బార్బొడోస్‌ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మిత్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నాడు.

తొలుత బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్‌ (63; 44 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా, ఆ తర్వాత బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి బార్బడోస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Friday, August 24, 2018, 11:56 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X