న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రశాంతంగా ఉండే స్పిన్నర్లు టీ20ల్లో కీలకపాత్ర పోషిస్తారు'

India vs Bangladesh 2019 : Washington Sundar Says 'Spinners Have A Big Role To Play In T20I'
Calm and composed spinners play a big role in T20s: Washington Sundar

హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చాహల్‌ (2/28), సుందర్‌ (1/25) కీలక పాత్ర పోషించారు.

బంగ్లా ఓపెనర్లు 7 ఓవర్లకు 60 పరుగులు చేసి జట్టుని పటిష్టస్థితిలో నిలిపినప్పటికీ... ఆ తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగడంతో వరుస విరామాల్లో బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ "టీ20 ఫార్మాట్‌లో స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకం. ఎందుకంటే వారు బంతిని వేగంగా మార్పులు చేస్తారు. కొన్నిసార్లు పిచ్‌లు నుంచి స్పిన్నర్లకు తక్కువ సహకారం ఉంటుంది" అని అన్నాడు.

మ్యాచ్‌కు హాజరైన 8 అడుగుల అఫ్గాన్ ఫ్యాన్.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!!మ్యాచ్‌కు హాజరైన 8 అడుగుల అఫ్గాన్ ఫ్యాన్.. సెల్ఫీ కోసం ఎగబడిన అభిమానులు!!

ఏమి చేయాలో తెలుసుకోవడం

ఏమి చేయాలో తెలుసుకోవడం

"ఏమి చేయాలో తెలుసుకోవడం, బ్యాట్స్ మెన్ ఏ వైపు బంతిని బాదుతాడో, ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియడం ముఖ్యం. దీంతో పాటు విషయాలను సరళంగా ఉంచడం మరియు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. కానీ, ఇది ఆటలో భాగంగానే జరుగుతుంది" అని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు.

మిడిల్ ఓవర్లలో బౌలింగ్

మిడిల్ ఓవర్లలో బౌలింగ్

"నిజాయితీగా చెప్పాలంటే, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయగల మరియు ఆట యొక్క కోణాన్ని మార్చగల చాహల్‌ ఉండటం జట్టుకు అత్యంత ప్రయోజనకరం. అతను మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌కు వస్తాడు. 2-3 వికెట్లు తీసుకొని ఆటను పూర్తిగా మార్చేస్తాడు. వేర్వేరు బ్యాట్స్‌మెన్‌ వేర్వేరు ప్రణాళికలతో అతడిని ఎదుర్కొంటారు. చాహల్‌ చాలా తెలివైనవాడు" అని సుందర్‌ చెప్పుకొచ్చాడు.

రాజ్‌కోట్ వికెట్ చాలా బాగుంది

రాజ్‌కోట్ వికెట్ చాలా బాగుంది

"నిజం చెప్పాలంటే రాజ్‌కోట్ వికెట్ చాలా బాగుంది. బౌన్స్‌తో బంతి గమనం నిజంగా అద్భుతం. మేము గనుక తొలుత బ్యాటింగ్ చేసినట్లైతే 180 పరుగులు చేసేవాళ్లం. బంగ్లాదేశ్‌ను 153/6కు పరిమితం చేసేందుకు బౌలింగ్‌ విభాగం సమష్టిగా కష్టపడింది. మొదట్లో బంగ్లా ఆటగాళ్లు బాగా ఆడారు. బంతి బాగా బౌన్స్‌, పేస్‌ అవుతోంది" అని సుందర్ తెలిపాడు.

వేగం తగ్గించి బంతులు వేశాం

వేగం తగ్గించి బంతులు వేశాం

"ఆ తర్వాత వేగం తగ్గించి బంతులు వేశాం. ఈ సిరీస్‌లో మేం ఓ మ్యాచ్‌ ఓడాం. రెండోది గెలిచాం. ఇలాంటి పిచ్‌నే నాగ్‌పుర్‌లో కూడా ఆశిస్తున్నాం. రోహిత్ బ్యాటింగ్ చూసేందుకు నాకు హౌస్‌లో మంచి సీటు దొరికింది. అతను ఇలా ఆడితే అది స్టేడియంలో ఎవరికైనా ఒక ట్రీటే. రోహిత్ శర్మ బాదిన కొన్ని బౌండరీలు నమ్మశక్యంగా ఉన్నాయి" అని అన్నాడు.

Story first published: Friday, November 8, 2019, 15:25 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X