న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జంతువుల్లాగా ప్రవర్తించారు.. నా భార్య, కుమారుడిని బయటకు పంపించారు'

Called some rowdy Pakistan supporters animals: Herschelle Gibbs recalls his 2007 ban

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ హర్షలే గిబ్స్‌ తాజాగా 2007లో ఐసీసీ తనపై వేసిన రెండు టెస్టుల నిషేధాన్ని గుర్తుచేసుకున్నాడు. 2007లో మీరు నిషేధం ఎదుర్కోవడానికి కారణమేంటని గిబ్స్‌ను ఓ నెటిజన్‌ ప్రశ్నించింగా.. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించాడు. 'పాకిస్తాన్‌ నుంచి వచ్చిన కొంతమంది రౌడీ మద్దతుదారులను జంతువులు అని అన్నాను. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన నా భార్య, కుమారుడిని వారు తమ సీట్లలో నుంచి బలవంతంగా బయటకు పంపించారు' అని గిబ్స్‌ ట్వీట్ చేశాడు.

<strong>సాహా క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు.. బీసీసీఐ ఆదేశాలు.. ఎందుకో తెలుసా?!!</strong>సాహా క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు.. బీసీసీఐ ఆదేశాలు.. ఎందుకో తెలుసా?!!

 జాత్యహంకార వ్యాఖ్యలు:

జాత్యహంకార వ్యాఖ్యలు:

2007లో పాకిస్థాన్‌తో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో హర్షలే గిబ్స్‌ పాక్‌ అభిమానులను ఉద్దేశిస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఐసీసీ గిబ్స్‌పై రెండు టెస్టులు నిషేధించింది. తర్వాత నిషేధాన్ని ఎత్తివేయాలని ఐసీసీని గిబ్స్‌ కోరినా నిరాకరించింది. ఎందుకంటే.. గిబ్స్‌ తన సహచర ఆటగాళ్లతో అన్న పదాలు మైదానంలోని స్టంప్‌ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి. ఇదే విషయాన్ని గిబ్స్‌ తన ఆటోబయోగ్రఫీ 'టు ది పాయింట్‌'లోనూ పేర్కొన్నాడు.

నా భార్య, కుమారుడిని బయటకు పంపించారు:

నా భార్య, కుమారుడిని బయటకు పంపించారు:

'పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆ దేశ అభిమానులు తమ ప్రవర్తనతో మా జట్టు ఆటగాళ్లకు చికాకు తెప్పించారు. తన కళ్ల ముందే తన కుమారుడు రషార్డ్‌, భార్య లిసెల్‌ను వారు కూర్చున్న సీట్ల నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. మా జట్టు ఆటగాళ్లంతా ఇదే విషయమై చర్చించుకుంటుంటే అవన్నీ స్టంప్‌ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి' అని గిబ్స్‌ తన బుక్‌లో రాసుకొచ్చాడు.

జాత్యహంకార వ్యక్తిగా చిత్రీకరించారు:

జాత్యహంకార వ్యక్తిగా చిత్రీకరించారు:

'నేను ముస్లిం జాత్యహంకారిని అని, అందుకే ముస్లింలపై అలాంటి వ్యాఖ్యలు చేశానని ఆరోపించారు. చాలా కృంగిపోయా. కానీ.. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. నలుగురు ముస్లిం అత్తలతో పాటు 10 మంది ముస్లిం స్నేహితులు ఉన్న నా జీవితంలో నేను జాత్యహంకారిని ఎలా అవుతాను చెప్పండి' అని గిబ్స్‌ తన ఆత్మకథలో వివరించాడు.

2010లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌:

2010లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌:

గిబ్స్‌ అంతర్జాతీయ కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 90 టెస్టుల్లో 6167 పరుగులు, 248 వన్డేల్లో 8094 పరుగులు, 23 టీ20ల్లో 400 పరుగులు చేసాడు. జట్టు తరపున ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ స్థానంలో ఆడి ఎన్నో విజయాలు అందించాడు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి వన్డే చరిత్రలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గిబ్స్‌ 175 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. గిబ్స్‌ 2010లో చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు.

Story first published: Wednesday, January 22, 2020, 16:14 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X