న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్ఫరాజ్ ఏంటా బ్యాటింగ్.. ?

 Brooding Sarfraz Ahmed cuts loose to rediscover his groove

న్యూ ఢిల్లీ: 57 పరుగులకే సగం వికెట్లు పోయి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఎంతో ఆచితూచి ఆడాల్సివుంటుంది. వికెట్లకు అడ్డుగోడలా నిల్చొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాలి. కానీ పాకిస్తాన్‌ కెప్టెన్, వికెట్ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కానీ వికెట్ల ముందు 'అడ్డుగోడ'లా నిలబడలేదు.

1
44239
6 బంతుల్లోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టడంతో

6 బంతుల్లోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టడంతో

యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్‌ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ (4/78) దెబ్బకు 57/5. స్పిన్నర్లకి అతిగా అనుకూలించిన పిచ్‌పై ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఆరు బంతుల్లోనే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఒకానొక దశలో 57/5తో పాక్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

సర్ఫరాజ్‌ అహ్మద్‌ పక్కా ప్రణాళికతో

సర్ఫరాజ్‌ అహ్మద్‌ పక్కా ప్రణాళికతో

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆసీస్ స్పిన్నర్‌ లయన్‌ ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో వచ్చాడు. ఓపెనర్ ఫకార్ జమాన్ (94: 198 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సు)తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ (94: 129 బంతుల్లో 7ఫోర్లు) ఆరో వికెట్‌కి ఏకంగా 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఫ్ స్టంప్‌కి దూరంగా గింగిరాలు తిరిగే బంతుల్ని నాథన్ లయన్ వరుసగా సంధించడంతో.. మ్యాచ్‌లో కాసేపు సర్ఫరాజ్ అహ్మద్ తన బ్యాటింగ్ స్టాన్స్‌ని మార్చుకున్నాడు.

పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల స్కోర్‌

పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల స్కోర్‌

పూర్తిగా మూడు స్టంప్‌లను వదిలేసి.. బ్యాక్‌ఫుట్‌పైకి వెళ్లి లయన్ బంతుల్ని ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. వాస్తవానికి అప్పటికే పాక్ జట్టు ఐదు వికెట్లు చేజార్చుకున్న నేపథ్యంలో.. ఇలా సర్ఫరాజ్ వికెట్లను పూర్తిగా వదిలేసి బ్యాటింగ్ చేయాలనుకోవడం పెద్ద సాహసమే. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఆరు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నా హీరోగా మిగిలాడు.

సర్ఫరాజ్‌ ఏంటా బ్యాటింగ్‌ అంటూ ఫన్నీగా

సర్ఫరాజ్‌ ఏంటా బ్యాటింగ్‌ అంటూ ఫన్నీగా

ఇక ఈ టెస్టులో పాక్‌ అదరగొడుతోంది. పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ అబ్బాస్(5/33) ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం పాక్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ స్టాన్స్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక అభిమానులతో సహా మాజీ దిగ్గజ క్రికెటర్లు కూడా సర్ఫరాజ్‌ తీసుకున్న బ్యాటింగ్‌ స్టాన్స్‌పై కామెంట్స్‌ చేశారు. కొందరు అభిమానులు సర్ఫరాజ్‌ ఏంటా బ్యాటింగ్‌ అంటూ ఫన్నీగా స్పందించగా, మరికొందరు నీ ఆలోచనకు, బ్యాటింగ్‌ తెగింపుకు జోహార్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

Story first published: Thursday, October 18, 2018, 12:25 [IST]
Other articles published on Oct 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X