న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brian Lara: ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చూస్తుంటే నాకు ఆ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గుర్తొస్తున్నాడు

Brian Lara: Umran Malik bowling reminds me of Fidel Edwards

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో వెలుగుచూసిన అత్యుత్తమ క్రికెటర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా అత్యంత వేగవంతమైన బౌలింగ్‌తో ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే అడపాదడపా వేగవంతమైన బౌలింగ్ వేయడం కాదు.. కన్సిస్టెన్సీగా 150కి.మీ దరిదాపుల్లో బౌలింగ్ చేయడం ఉమ్రాన్ మాలిక్ సొంతం. ఐపీఎల్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనను క్రికెట్ దిగ్గజాలు సైతం మెచ్చుకుంటున్నారు. అతన్ని భారత జట్టులోకి అతి త్వరగా ఎంపిక చేయాలంటూ సూచనలు కూడా ఇస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ఆడుతున్న ఈ యువ ప్లేయర్ ఈ ఐపీఎల్లో ఆడిన 13మ్యాచ్‌లలో 20సగటుతో 21వికెట్లు పడగొట్టాడు.

అతను ఆర్సీబీతో 5వికెట్ల హాల్ కూడా సాధించాడు. ఇక అతని ప్రదర్శనను సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్, క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా మెచ్చుకున్నాడు. అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఉమ్రాన్ మాలిక్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ పేర్కొన్నాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ తనకు వెస్టిండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్‌‌‌ బౌలింగ్‌ను గుర్తుచేస్తుందని చెప్పాడు.

Brian Lara: Umran Malik bowling reminds me of Fidel Edwards

బ్రియాన్ లారా మాట్లాడుతూ.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చూస్తుంటే నాకు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్‌ గుర్తుకొస్తున్నాడు. ఫిడెల్ ఎడ్వర్డ్స్ కూడా తన ఆరంభ కెరీర్లో ఉమ్రాన్ మాలిక్ లాంటి పదునైన పేస్ వేస్తూ ఆకట్టుకునేవాడు. ఎడ్వర్డ్స్ లాంటి ఫాస్ట్ అండ్ షీర్ పేస్ ఉమ్రాన్ మాలిక్ కలిగి ఉన్నాడు. ఇక ఉమ్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వెళ్లడానికి ఇంకా ఎంతో టైం పట్టదు. అతను ఆ విషయాన్ని అర్థం చేసుకుని తన ఫాం కొనసాగించాలి. అతను తప్పకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతాడని నేను భావిస్తున్నా' అని లారా పేర్కొన్నాడు.

ఇక ఇటీవలే రవిశాస్త్రి సైతం ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనకు మంత్రముగ్ధుడై బీసీసీఐకి పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రి మాట్లాడుతూ.. మాలిక్‌ను నేరుగా సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తీసుకోవాలని పేర్కొన్నాడు. అలాగే కోచ్ సిబ్బందికి సూచిస్తూ అతనికి బౌలింగ్ చేయాల్సిన లెంత్ మీద అవగాహన కల్పించాలని పేర్కొన్నాడు. స్టంప్‌ల మీద దృష్టి పెట్టాలని చెప్పాలన్నాడు. రెడ్-బాల్ క్రికెట్‌ (టెస్ట్)లో అతను స్థిరమైన ప్లేయర్‌గా మారగలడని రవిశాస్త్రి పేర్కొన్నాడు. బుమ్రా, షమీతో పాటు బౌలింగ్ యూనిట్లో ఉమ్రాన్ మాలిక్‌ను దింపితే.. భారత బౌలింగ్ అటాక్ అత్యంత తీవ్రమైందిగా ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, May 21, 2022, 18:35 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X