న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఆ మూడు జట్లకే ఉంది: లారా

Brian Lara picks three favourites to win T20 World Cup

ముంబై: అక్టోబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఆ కప్ గెలిచే అవకాశాలు భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లకే ఎక్కువుగా ఉన్నాయని విండీస్‌ మాజీ దిగ్గజం బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డారు. రానున్న ప్రపంచకప్‌ ఒక అద్బుతమైన ప్రపంచకప్‌గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రస్తుతం అన్ని జట్లు టీ20లలో మంచి జట్లను కలిగి ఉన్నాయి కాబట్టి రసవత్తర పొరులు అభిమానులు చోడొచ్చని లారా అన్నారు.

కరోనా ఎఫెక్ట్‌.. స్వదేశానికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు!!కరోనా ఎఫెక్ట్‌.. స్వదేశానికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు!!

 భారత్‌కు అవకాశాలు ఎక్కువ:

భారత్‌కు అవకాశాలు ఎక్కువ:

తాజాగా ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో లారా మాట్లాడుతూ... 'భారత్ టీ20 ప్రపంచకప్‌ను ఘనంగానే ఆరంభిస్తుందని నేను అనుకుంటున్నా. టీమిండియాకు కప్‌ను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జట్టులో చాలా మంది హిట్టర్లు ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాకు సొంతగడ్డ కావడం ఆ జట్టుకు ,మరింత బలం చేకూర్చే విషయమే. అయితే ఎంత సొంత గడ్డైనా ప్రదర్శన బాగుంటేనే కప్ కొట్టగలదు' అని అన్నారు.

టీ20ల్లో విండీస్‌ దుమ్మురేపుతోంది:

టీ20ల్లో విండీస్‌ దుమ్మురేపుతోంది:

'విండీస్‌ జట్టు విషయానికి వస్తే టెస్ట్, వన్డేలలో ఆటతీరు ఎలా ఉన్నా టీ20ల్లో మాత్రం దుమ్మురేపే ప్రదర్శననే నమోదు చేస్తోంది. సీనియర్లు, యువకులతో సమతూకంగా ఉంది. అయితే జట్టుకు సుస్థిరత లేకపోవడం వల్ల ప్రపంచకప్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా రానున్న ప్రపంచకప్‌లో రసవత్తరమైన పోరుకు మాత్రం కొదువ ఉండదు. ఎందుకంటే అన్ని జట్లు పటిష్టంగా ఉన్నాయి' అని లారా పేర్కొన్నారు.

 అక్టోబర్‌ 18న ప్రపంచకప్‌:

అక్టోబర్‌ 18న ప్రపంచకప్‌:

విండీస్‌ టీ20 ఫార్మాట్‌లో రెండు సార్లు ప్రపంచపకప్‌ టైటిల్‌ సాధించిన జట్టుగా నిలిచింది. భారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలవగా.. ఆసీస్‌ ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవకపోవడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 18న మొదలుకానుంది. పొట్టి కప్‌కు ఇక ఆరు నెలల సమయం మాత్రమే ఉండడంతో.. టీంలు అన్ని ఇప్పటినుండే జట్లను తయారుచేసుకునే పనిలో పడ్డాయి.

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ రద్దు:

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ రద్దు:

బ్రియాన్‌ లారా ప్రసుత్తం రోడ్‌ సేప్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రోడ్‌సేప్టీపై అవగాహన కల్పించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం ఈ సిరీస్‌ను నిర్వహిస్తోంది. వెస్టిండీస్‌ లెజెండ్స్‌కు లారా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజుకు విస్తరిస్తుండటంతో 'రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌'ను తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్‌ రద్దు కావడంతో క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, బ్రయాన్‌ లారాలు నిరాశ చెందారు. అయితే ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం ఇదే సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు.

Story first published: Friday, March 13, 2020, 21:04 [IST]
Other articles published on Mar 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X