న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brendon Mccullum: కేకేఆర్ టీం తరఫున రింకూ సింగ్‌ కొన్నేళ్ల పాటు ఆడడం ఖాయం

Brendan McCullum said KKR would own Rinku Singh for more seasons

లక్నోతో జరిగిన ఉత్కంఠకరమైన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ.. యువ బ్యాటర్ రింకూ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున వెలుగుచూసిన అత్యుత్తమ ప్లేయర్ అని పేర్కొన్నాడు. రాబోయే సీజన్లలోనూ కేకేఆర్ ఫ్రాంచైజీ అతనిపై పెట్టుబడి పెడుతుందని చెప్పారు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో దాదాపు కేకేఆర్‌ను విజయపు అంచుల వరకు తీసుకెళ్లిన రింకూపై మెక్కల్లమ్ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇక మెక్కల్లమ్ మాట్లాడుతూ.. కచ్చితంగా రింకూ ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టులో కనుగొనబడ్డ మంచి ప్లేయర్. కేకేఆర్ యాజమాన్యం అతన్ని నిస్సందేహంగా రాబోయే కొన్ని సంవత్సరాలు కేకేఆర్ తరఫున ఆడించేలా అతనిపై పెట్టుబడి పెడుతుంది. మేము అతని పురోగతిని రాబోయే సీజన్లలో మరింత చూస్తాము. అతని మరింత ఉన్నతంగా రాణించి గొప్ప స్థానాలకు కూడా చేరవచ్చు' అని కేకేఆర్ కోచ్‌గా వీడ్కోలు తీసుకుని ఇంగ్లాండ్ తదుపరి టెస్ట్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న మెక్కల్లమ్ మ్యాచ్ అనంతరం విలేకరులతో తెలిపాడు.

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఎల్‌ఎస్‌జీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కేవలం 15బంతుల్లోనే 40పరుగులు చేసిన రింకూ దాదాపుగా తన జట్టును విజయతీరాలకు చేర్చడానికి శాయశక్తుల శ్రమించాడు. అయితే విజయానికి 2బంతుల్లో 3పరుగులు చేయాల్సిన తరుణంలో ఈవెన్ లూయిస్ ఒంటి చేత్తో అందుకున్న అద్భుతమైన క్యాచ్‌కు రింకూ ఔటయ్యాడు. దీంతో కేకేఆర్ 2పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇకపోతే 24 ఏళ్ల రింకూ.. ఎడమచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాకుండా ఆఫ్-బ్రేక్ బౌలర్ కూడా. ఈ సీజన్‌లో కేకేఆర్ తరఫున మంచి ప్రదర్శన చేశాడు. అతను వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 42పరుగులు చేశాడు.

'చాలా మంది ప్లేయర్లు మిడిల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయలేరు. కానీ రింకూ ఈ సంవత్సరం రెండు సందర్భాలలో జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. అత్యంత క్రిటికల్ సిచువేషన్లో ఎంతో గొప్పగా రాణించాడు. అతని ప్రదర్శన పట్ల నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇకపోతే ఇంగ్లాండ్ కోచ్‌గా మారిన నేపథ్యంలో కేకేఆర్ ను వీడాల్సి వస్తోంది. అయినప్పటికీ నేను కేకేఆర్ ప్లేయర్లందరినీ ముఖ్యంగా రింకూను వారి ఆటతీరును అనుసరిస్తూనే ఉంటాను. గత కొన్నేళ్లుగా కేకేఆర్ తరఫున కోచ్‌గా మంచి అనుభవాన్ని గడించాను' అని మెక్కల్లమ్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, May 19, 2022, 20:41 [IST]
Other articles published on May 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X